కరీంనగర్ జిల్లా : ఈటల రాజేందర్ పై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి  హరీష్ రావు ఫైర్ అయ్యారు.   హుజూరాబాద్ లో స్వాగతం చూస్తా ఉంటే  శ్రీనివాస్ భారీ మెజారిటీ తో గెలువబోతున్నడు అని అర్థమైందని.. ఎన్నికలు వచ్చినప్పుడు గెలిస్తే ఎం చేయాలో చెప్పాలని పేర్కొన్నారు. రెండు గుంటలున్న గెల్లు శ్రీనుకు..200 ఎకరాలు ఉన్న ఈటలకు మధ్య  పోటీ అన్నారు. బిజెపి పార్టీ నుండి పోటీ చేసే ఈటెల రాజేందర్ నన్ను చూసి ఓటు వేయమంటున్నాడని.. బిజెపి లో ఉంటు ఆత్మ వంచన చేసుకొని ఆత్మగౌరవం అంటున్నాడని మండిపడ్డారు. మంత్రి గా ఉన్నప్పుడు చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉండి ఏం చేస్తాడని...టీఆరెఎస్ సంక్షేమ పథకాలు ఇస్తే బిజెపి ఎం ఇచ్చిందని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని..  పోటీ ఉన్నది టీఆరెఎస్ పార్టీ మరియు బిజెపికెనని వెల్లడించారు. 

బిజెపి వల్ల ధరలు పెరిగి అన్ని ప్రైవేట్ చేసిన బిజెపి వైపు ఉందామా ? లేదా సంక్షేమ పథకాలు ఇచ్చిన టీఆరెఎస్ వైపు ఉందామా.? ప్రశ్నించారు.  ఈటల రాజేందర్ రైతు బందు వద్దు అంటున్నాడని.. అలాంటి వారికి ఎలా బుద్ది చెప్పాలో  ప్రజలకు తెలుసన్నారు.  సంక్షేమ పథకాలను విమర్శించే ఈటల రాజేందర్ ను ప్రజలు ఆలోచించాలని.. రైతు బంధు వద్దన్న ఈటల రాజేందర్..  పది లక్షలు రైతు బందు తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యే గా, మంత్రి గా అవకాశమివచ్చిన కేసీఅర్ ను ఆరేయి అంటున్నాడని...బిజెపి లో చేరాక ఈటల రాజేందర్ భాష మారిందని మండిపడ్డారు.

 ఓటమి భయం తో మాటలు జారుతున్నడని చురకలు అంటించారు. రాజేందర్ గెలిస్తే ఒక వ్యక్తి గెలుస్తాడు..  ప్రజలు మాత్రం ఓడిపోతారన్నారు. అనంతరం గేళ్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాకు టికెట్ ఇచ్చి హుజురాబాద్ ప్రజలు సేవ చేయమన్న సిఎం కేసీఆర్ కు పాదాభివందనాలన్నారు.  నేను పేద కుటుంబం లో పుట్టిన బిడ్డనని...విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో పని చేశానని వెల్లడించారు గేళ్లు శ్రీనివాస్. కేసీఆర్ ఉద్యమ స్పూర్తితో పని చేశానని.. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసినందుకు సీఎం కేసీఆర్ గుర్తించారని తెలిపారు. అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని.. ఒక పని మనిషిలా పని చేస్తానని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: