నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చాలా వేడిగా ఉన్న సంగతి అర్ధమవుతుంది. కీలక నాయకులు అందరూ టీడీపీ నుంచి బయటకు వచ్చారు. అధికార పార్టీ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేయడం కూడా చూస్తున్నాం. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు కూడా నిన్న జరిగిన దాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు సమర్ధించుకుంటూ వ్యాఖ్యలు చేయడం వింతగా మారింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక ఏపీ డీజీపీ కూడా ఈ దాడి విషయంలో టీడీపీ నేతలను తప్పుబట్టడం ఆశ్చర్యపరిచింది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దాడికి సంబంధించి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా స్పందిస్తూ తమ కార్యకర్తలను సమర్ధించుకునే ప్రయత్నం చేసారు. నిన్నటి దాడి ని చూపించి రాజకీయంగా లబ్ది పొందాలని టీడీపీ చూస్తుంది అని అంబటి రాంబాబు నేడు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు. ఎలాంటి భాష మాట్లాడుతున్నారో వారికి అర్థం అవుతుందా అంటూ ఆయన టీడీపీ నేతలను నిలదీశారు. డీజీపీ ని పాలేరు అని మాట్లాడుతున్నారు అని పోలీసులను డి మొరలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారుఅంటూ విమర్శలు చేసారు.

చంద్రబాబు 36 గంటలు కాదు 360 గంటలు నిరాహారదీక్ష చేసినా ప్రజలు నమ్మరు అని అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. ఇలాంటి కుళ్లు తో వ్యవహరించే వారికి బూడిద మిగులుతుంది అని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు. చంద్రబాబు 36 గంటల దీక్ష చేసినంత సేపు... ప్రజలు చంద్రబాబు నే తిట్టుకుంటారు అని అన్నారు ఆయన. క్షమాపణలు చెప్పేవరకు ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయేమో చెప్పలేము అని అన్నారు అన్నారు. దాడులు ఎవరు చేస్తున్నారో తెలియదు అని ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: