సాధారణంగా ఎక్కడికైనా వెళ్తున్న సమయంలో రోడ్డుపై పాము కనిపిస్తే అందరూ భయపడిపోతుంటారు. ఇక పాము మన వైపు వస్తుంది అంటే అక్కడినుంచి పరుగో పరుగు అంతలా భయపడిపోతుంటాము. కేవలం విషపూరితమైన పాములను చూస్తేనే కాదు.. విషం లేని పాములను చూసిన అందరూ వణికి పోతూ ఉంటారు. ఇకపోతే ఇటీవలే ఏకంగా ఒక మృత దేహం చుట్టూ 125 పాములు కనిపించడం అందరినీ షాక్కు గురి చేసింది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. వ్యక్తి కనిపించడం లేదంటూ పోలీసులకు సమాచారం వెళ్ళింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు అతని ఇంటికి చేరుకున్నారు  తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో ముందుగా లోపల ఎవరైనా ఉన్నారా అంటూ పిలిచారు.


 కానీ లోపలినుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఇక అక్కడ కనిపించిన దృశ్యాలతో ఒక్క సారిగా ఉలిక్కి పడి భయభ్రాంతులకు గురయ్యారు పోలీసులు. కనిపించకుండా పోయిన వ్యక్తి ఆ ఇంట్లో కింద పడి పోయి ఉన్నాడు.  ఇక అతని మృతదేహం చుట్టూ దాదాపు 125 పాములు కనిపించడంతో అందరూ ఒక్కసారిగా గగుర్పాటుకు గురయ్యారు. ఈ ఘటన అమెరికాలోని మేరీలాండ్ లో వెలుగులోకి వచ్చింది. చార్లెస్ కౌంటీ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయాడు.


 దీంతో ఇది గమనించిన పొరుగింటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు లో భాగంగా కనిపించకుండా పోయిన వ్యక్తి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అప్పుడు నుంచి గడియ పెట్టి ఉండడంతో తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లారూ. కనిపించకుండా  పోయిన వ్యక్తి లోపల విగతజీవిగా కిందపడిపోయి ఉన్నాడు. అయితే అతని మృతదేహం చుట్టూ 125 పాములు కనిపించాయి. ఇందులో విషపూరితమైన కోబ్రా లతోపాటు 14 అడుగుల పొడవు ఉన్న ఒక భారీ కొండచిలువ కూడా ఉంది. అయితే ఈ పాములు అన్నింటిని అతను పెంచుకుంటూ ఉన్నట్లు  స్థానికులు తెలిపారు. కొంత మంది సహాయక సిబ్బందిని అక్కడికి పిలిపించి పాములు అన్నింటినీ స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎలా చనిపోయాడు అన్న దానిపై మాత్రం వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: