వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా చంద్రబాబునాయుడు పెద్ద వ్యూహం రచించారట. అదేమిటయ్యా అంటే సరికొత్త వ్యూహకర్తను పెట్టుకోవటం. అవును సుశీల్ కానుగోలు (కే) సూచనలు, సలహాల ప్రకారమే ఇపుడు చంద్రబాబు అండ్ కో నడుచుకుంటోందని సమాచారం. మొన్నటివరకు టీడీపీ వ్యూహకర్తగా రాబిన్ శర్మ పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల శర్మతో కాంట్రాక్టును టీడీపీ కట్ చేసేసుకుందట.




శర్మ పనితీరుకు టీడీపీకి ఎందుకో లింకు కుదిరినట్లు లేదు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల వరకు శర్మనే వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తర్వాతే శర్మకు టీడీపీ గుడ్ బై చెప్పేసిందట. మళ్ళీ ఇంతకాలానికి సునీల్ కానుగోలుతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ సుశీల్ ఎవరంటే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ సంస్ధకు అధినేత. ఈ సంస్ధ కూడా రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగానే  పనిచేస్తుంది. అంటే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టైపే అనుకోవాలి.




కర్నాటకలోని బళ్ళారి మూలాలున్న సుశీల్ పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. తర్వాత అమెరికాలో చదువుకున్నారు.  అమెరికా నుండి వచ్చేసిన తర్వాత రాజకీయాలపై ఉన్న ఆసక్తితో అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అనే సంస్ధను ఏర్పాటు చేశారు. మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో మొదట్లో డీఎంకే అధినేత  స్టాలిన్ తో సునీల్ కలిసి పనిచేశారు. అయితే చివరలో ప్రశాంత్ కూడా చేరటంతో సునీల్ బయటకు వచ్చేశారు. అలాగే ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్ధాన్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు.




మొన్నటివరకు తెలంగాణాలోని టీఆర్ఎస్ పార్టీతో కూడా కొంత కాలం పనిచేశారని సమాచారం. ఎప్పుడైతే కేసీయార్+కేటీయార్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీలయ్యారో తర్వాత సుశీల్ సైడయిపోయినట్లు తెలుస్తోంది. దాంతో సుశీల్ తో చంద్రబాబు టచ్ లోకి వెళ్ళారట. తర్వాత టీడీపీతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈమధ్యనే టీడీపీ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ అవటానికి సుశీల్ సలహానే కారణమంటున్నారు. మరి ఈయనిచ్చే సలహాలు, సూచనలైనా టీడీపీని గట్టెక్కిస్తాయేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: