తెలంగాణాలో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ లో తనకు ప్రాధాన్యత లేదు అన్న వివిధ కారణాల వలన రాజీనామా చేసినట్లుగా పలు వార్తా పత్రికలు చెప్పుకొచ్చాయి. రాజీనామా అయితే చేశారు కానీ ఇంకా అధికారికంగా ఏ పార్టీలోకి వెళ్లనున్నారు అన్న వివరాలు తెలియలేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ లోకి జంప్ అవుతున్నారట. ఇదిలా ఉంటే... ఈ ఎన్నికలో గెలవడానికి ఎప్పటిలాగే అధికార తెరాస, కాంగ్రెస్ మరియు బీజేపీ లు ప్రధానంగా పోటీ పడనున్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఎక్కువగా బలం ఉందని తెలుస్తోంది.

పోటీలో ఎన్ని పార్టీలు ఉన్నా గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికే సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యలు చేశారు. ఇక నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ గెలుపును అడ్డుకునే శక్తి ఎవరికైనా ఉందా అంటే ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా , ఎన్ని రాజకీయాలు చేసినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా సింగ్ కాంగ్రెస్ నాయకురాలు బల్ల గుద్ది మరీ చెప్పారు. ఇదిలా ఉంటే... కోమటిరెడ్డి సోదరులు ఎలాగైనా ఇక్కడ కాంగ్రెస్ ను గెలవకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకరేమో అధికారికంగా పార్టీ బయటకు వెళ్లి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుంటే ? ఇంకొకరు ఏమో పార్టీలోనే ఉంటూ.. గెలుపును అడ్డుకునే ప్రాయత్నాల్లో నిమగ్నం అయి ఉన్నారు.  కోమటిరెడ్డి వెంకట రెడ్డి పై కాంగ్రెస్ హై కమాండ్ కూడా గుర్రుగా ఉంది.  మరి మునుగోడులో కాంగ్రెస్ విజయాన్ని కోమటిరెడ్డి సోదరులు అడ్డుకుంటారా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.    
మరింత సమాచారం తెలుసుకోండి: