చంద్రబాబునాయుడు జనాలకు ఒక లేఖ రాశారు. అందులో ఏముందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ చేస్తున్న పోరాటంలో అందరు కలసిరావాలట. జగన్ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తోందట. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల హక్కులకు, స్వేచ్చకు భంగం కలుగుతోందట. జగన్ నియంతృత్వపోకడలకు రోజులు దగ్గరపడ్డాయి కాబట్టి జనాలంతా టీడీపీతో చేతులు కలపాలట. అయితే చంద్రబాబు చెబుతున్నదాంట్లోను, తాజాగా రాసిన లేఖలోని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉంది.

ఒకవైసేమో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించేందుకు జనాలంతా రెడీగా ఉన్నారంటు చెబుతారు. మరోవైపేమో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న పోరాటంలో   జనాలంతా చేతులు కలపాలంటారు. నిజంగానే జగన్ ప్రభుత్వంపై జనాలంతా అంత వ్యతిరేకంగా ఉంటే తమతో చేతులు కలపమని జనాలను చంద్రబాబు బతిమలాడుకోవాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం మొదలుపెడితే జనాలే వచ్చి చేరుతారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపును పార్టీ నేతల్లోనే చాలామంది పట్టించుకోవటంలేదు. పార్టీ వేదికల్లో ఈ విషయమై స్వయంగా చంద్రబాబే అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా జరిగిన విస్తృతస్ధాయి సమావేశంలో బయటపెట్టిన రిపోర్టు ప్రకారం బాదుడేబాదుడు కార్యక్రమం అట్టర్ ఫ్లాపయ్యింది.  175 నియోజకవర్గాల్లో 166 నియోజకవర్గాల్లో బాదుడేబాదుడు ప్రోగ్రామ్ ను తమ్ముళ్ళు అసలు పట్టించుకోలేదు.

చంద్రబాబు పిలుపును తమ్ముళ్ళే పట్టించుకోనపుడు ఇక మామూలుజనాలు పట్టించుకుంటారా ? పైగా చంద్రబాబు పరిపాలన ఎలాగుంటుందో  జనాలందరికీ అనుభవమైంది. జగన్ పాలనలో అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏవైతే జరిగాయని చంద్రబాబు అంటున్నారో అవన్నీ తన హయాంలో కూడా జరిగిన విషయాన్ని తాను కన్వీనియంట్ గా మరచిపోతున్నారు. కానీ అవన్నీ జనాలకు గుర్తుంటుంది కదా. జనాల మెమోరీ మరీ అంత తక్కువని చంద్రబాబు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. 
మరింత సమాచారం తెలుసుకోండి: