సాధారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవాలని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అయితే ఇలా వరల్డ్ రికార్డు సాధించడం మాత్రం మాట్లాడుకున్నంత ఈజీ కాదు అని చెప్పాలి   ప్రపంచంలో ఉన్న అందరికంటే మనలో ఒక స్పెషల్ టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది ఏళ్ల తరబడి కఠోరమైన శిక్షణ తీసుకొని ఇక గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమందికైతే ఏళ్ల తరబడి నిరీక్షణగా ఎదురు చూసిన వరల్డ్ రికార్డు కొట్టడం మాత్రం ఇక అందని ద్రాక్ష లాగే మారిపోతూ ఉంటుంది.


 ఇకపోతే ఇటీవల కాలంలో ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో సంపాదించడం కోసం కొంతమంది చేస్తున్న విచిత్రమైన పనులు అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మరి కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రపంచ రికార్డు కోసం ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఏమాత్రం కష్టపడకుండా ఏకంగా తమ బాడీలో ఉన్న వెంట్రుకలు లేదా శరీర భాగాల కారణంగా గిన్నిస్ బుక్ రికార్డులు కొట్టడం కూడా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మొన్నటికి మొన్న పెద్దగా పాదాలు ఉండడంతో గిన్నిస్ బుక్ రికార్డు కొట్టింది ఒక మహిళ.


 ఇక ఇప్పుడు ఒక వ్యక్తి ఏకంగా చెవి వెంట్రుకల కారణంగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. తమిళనాడుకు చెందిన ఆంథోనీ విక్టర్ అనే రిటైర్డ్ స్కూల్ హెడ్మాస్టర్ తన చెవి వెంట్రుకలతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 15 ఏళ్ల నుంచి చెవి వెంట్రుకలను పెంచుకుంటున్న ఆయన 2007లో 18.1 సెంటీమీటర్ల పొడవైన చెవి వెంట్రుకలతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు తన గిన్నిస్ రికార్డును ఎవరు బ్రేక్ చేయకపోవడంతో 2023 లో కూడా మరోసారి గిన్నిస్ బుక్ రికార్డులో అతనే చోటు సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: