ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఇరుక్కునేట్లే కనబడుతోంది. స్కిల్ డెలవప్మెంట్ సెంటర్ కుంభకోణంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలపై అప్పట్లో ఛైర్మన్ గా పనిచేసిన గంటా సుబ్బారావు, డైరెక్టర్ లక్ష్మీనారాయణతో పాటు మరో 24 మందిని విచారణకోసం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిలిచింది.  డెవలప్మెంట్ సెంటర్ కు జర్మనీ సంస్ధ సీమెన్స్ తో రాష్ట్రప్రభుత్వం రు. 3350 కోట్లకు ఒప్పందంచేసుకుంది. ఇందులో రాష్ట్రప్రభుత్వం వాట 370 కోట్లయితే మిగిలింది సీమెన్స్ సంస్ధదే.

అయితే ప్రభుత్వం విడుదలచేసిన రు. 370 కోట్లలోనే సుమారు 241 కోట్లు అవినీతి జరిగిందని ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఈడీ నిర్ధారించుకున్నది. దాంతో గంటా, లక్ష్మీనారాయణ తదితరుల్లో వణకు మొదలైంది. విచారణలో వీళ్ళల్లో ఎవరైనా అప్రూవర్లుగా మారితే చంద్రబాబుకు తలనొప్పులు తప్పవు. ఎందుకంటే వీళ్ళంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులన్న విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు సలహాలు, సూచనలు లేకుండా వీళ్ళిద్దరు ఏమీ చేసే అవకాశంలేదు. కాకపోతే పిక్చర్లో ఎక్కడా చంద్రబాబు పేరుండదు.

అంటే తెరవెనుకున్న చంద్రబాబు కాకుండా తెరముందున్న గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ మాత్రమే అందరికీ కనిపిస్తారు. ఇపుడు గనుక విచారణలో అప్రూవర్లుగా ఎవరైనా మారిపోతే మొదట సమస్యల్లో పడేది చంద్రబాబే అనటంలో సందేహంలేదు. ఎందుకంటే రు. 241 కోట్ల అవినీతి డబ్బును షెల్ కంపెనీలు పెట్టి రకరకాల మార్గాల్లో తరలించారనే విషయాన్ని ఈడీ గుర్తించింది.  అలాగే ఒప్పందంలో భాగంగా సీమెన్స్ కంపెనీ పెట్టాల్సిన పెట్టుబడులు ఏమయ్యాయి ? ఏరూపంలో వాడారు ? అనేవి తేలుతుంది.


అసలు కంపెనీనుండి ఎంత పెట్టబడులు వచ్చాయనే విషయాలపైన కూడా ఈడీ విచారణ జరుపుతోంది. ఈ ప్రశ్నలన్నింటికీ సుబ్బారావు, లక్ష్మీనారాయణ అండ్ కో సమాధానాలు చెప్పాలి. ఈ విచారణలో ఎవరు బ్రేకైనా అప్పట్లో ఏమి జరిగిందనే వాస్తవ విషయాలు బయటకు వచ్చేస్తాయి. దాంతో చంద్రబాబు గట్టిగా తగులుకునే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు వీళ్ళెవరు విచారణకు హాజరుకాకుండా ఏదోరూపంలో నెట్టుకొస్తున్నారు. మరి విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయి బాధ్యులుగా ఎవరు తేలుతారనేది ఆసక్తిగా మారింది.మరింత సమాచారం తెలుసుకోండి: