విషమంగా తారకరత్న పరిస్థితి.. స్పందించిన చంద్రబాబు?

నందమూరి హీరో తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా చాలా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రి వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రికి వెళ్లిన నారా చంద్రబాబు నాయుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం ఆయనకి ఐసీయూలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.ఇక తారకరత్న భార్య అలేఖ్య తండ్రి మోహనకృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన చంద్రబాబు వారికి గట్టిగా ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.'కుప్పం హాస్పిటల్ కంటే  బెంగళూరులో ట్రీట్ మెంట్ బెటర్ గా ఉంటుందనే ఉద్దేశంతోనే డాక్టర్ల సలహా మేరకు రాత్రి 2 గంటలకు ఇక్కడికి తీసుకొచ్చారు. తారకరత్నను కాపాడేందుకు డాక్టర్లు అన్ని విధాలా కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచి ఆయనకు చికిత్స చేస్తున్నారు. 


డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ' చంద్రబాబు నాయుడు తెలిపారు.అయితే తారకరత్న కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని డాక్టర్లు తెలిపారని చంద్రబాబు నాయుడు మీడియాకు వివరించారు. వైద్యులు హెల్త్ బులిటెన్ ని విడుదల చేస్తున్నారన్నారు. తారకరత్న చాలా త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు.ఇక తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారని పురంధేశ్వరి చెప్పారు. సోమవారం నాడు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి అంచనావేస్తామని వైద్యులు చెప్పారని తెలిపారు.ఇక తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ, నందమూరి సుహాసిని, ఇంకా అలాగే పరిటాల శ్రీరామ్ ఆస్పత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడారు.ప్రస్తుతానికి అయితే తారక రత్న పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: