
ఇక అసలు విషయంలోకి వెళితే.. ఆయన మాట్లాడిన విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే విషయం పైన అందుకు సంబంధించిన కేవలం క్లూస్ మాత్రమే ఇస్తానంటూ తెలియజేశారు.. అయితే ఈ వీడియోలో తెలిపిన ప్రకారం.. రాజ్ దీప్ శరదేశాయ్ మాట్లాడుతూ గ్రామీణ పేద ప్రజలు , మహిళలు వీళ్ళు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్లే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారంటూ తెలియజేశారు.. దీంతో వైఎస్ఆర్సిపి పార్టీ కూడా సంబరాలు చేసుకుంటూ ఉండగా.. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో వైసిపి పార్టీకి ఎక్కువ బలం ఉందని అలాగే మహిళలు కూడా వైసిపి పార్టీ పక్కే ఉన్నారనే విధంగా తెలుపుతున్నారు.
ముఖ్యంగా వైసిపి మేనిఫెస్టోలోని పథకాలే మహిళలను తన వైపు తిప్పేలా చేశాయని కూడా తెలుపుతున్నారు.. ఈ సమయంలోనే తెలుగుదేశం పార్టీ కూడా ఏం ఫీలవుతోందంటే.. లేదు లేదు చంద్రబాబు నాయుడు ఇస్తానన్న పథకాల వల్లే వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పుకుంటున్నారు. జగన్ ఇచ్చిన దాని కంటే ఎక్కువగా ఇస్తున్నాం కాబట్టే మా మావైపే గ్రామీణ ప్రాంతాన్ని ప్రజలు మహిళలు ఉన్నారంటూ తెలుపుకుంటున్నారు. అయితే ఇందులో ఏది నిజమా అన్నది తెలియాలి అంటే మరో కొద్దిరోజులు ఆగాల్సింది... అందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. ఈసారి ఎన్నికలు కూడా పోటాపోటీ కానీ సాగనున్నాయి.