మాజీ సీఎం వైఎస్ జగన్ తాజాగా చంద్రబాబును విమర్శిస్తూ చేసిన కామెంట్లు పార్టీలో సంచలనం అవుతున్నాయి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని చివరకు ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నారని జగన్ తెలిపారు. ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా మన ప్రభుత్వం సాకులు చూపలేదని మాట తప్పకుండా మానిఫెస్టోనే అమలు చేశామని జగన్ తెలిపారు.
 
మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించామని జగన్ పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఇంటికి మంచి చేశామని వచ్చే ఎన్నికల్లో ఈ మంచే మనకు శ్రీరామరక్ష అని జగన్ తెలిపారు. చంద్రబాబు మోసాలు ప్రజల ఆగ్రహానికి దారి తీస్తాయని జగన్ ఫలావు ఇచ్చాడని బాబు బిర్యానీ ఇస్తానని చెప్పి మోసం చేశాడని ప్రస్తుతం ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని జగన్ అన్నారు.
 
నేను సీఎంగా ఉండి ఉంటే ప్రజలకు రైతుభరోసా, అమ్మఒడి, సున్నావడ్డీ, ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన, మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా అమలు అయ్యేవని ఆయన పేర్కొన్నారు. ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. మన ప్రభుత్వం రైతులకు ఫ్రీ భీమా ఇచ్చిందని ప్రస్తుతం అది కూడా లేదని ప్రతి అడుగులోనూ మోసం కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
 
విద్యాకానుక పంపిణీ కూడా అస్తవ్యస్తంగా జరుగుతోందని జగన్ తెలిపారు. చీకటి తర్వాత వెలుగు ఉంటుందని రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని జగన్ చెప్పుకొచ్చారు. మనం మోసం చేయలేదని అందుకే వచ్చే ఎన్నికల్లో మన పార్టీ ఘన విజయం సాధిస్తుందని జగన్ కామెంట్స్ చేశారు. మోసాలు, అబద్ధాలకు చంద్రబాబు అలవాటు పడ్డారని మాజీ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. జగన్ కామెంట్స్ గురించి టీడీపీ లేదా చంద్రబాబు నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందేమో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: