డ్రోన్లు, మిస్సైల్స్ తో పాకిస్తాన్ చేస్తున్న దాడులను సైతం ఇండియా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. ఈ రెండు విఫలం కావడంతో ఇప్పుడు పాకిస్తాన్ మరొక కుతంత్రానికి తెరతీసినట్లుగా కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతాలలో దాడులు చేసి భారత్ ను సైతం సమర్ధవంతంగా ఇబ్బందులు పెట్టాలని పన్నాగం చేస్తోంది పాకిస్థాన్. దీంతో ఆ దేశానికి చెందిన అలాంటి అవకాశం ఇవ్వకుండా భారత్ ఆర్మీ ని మరింత దృఢంగా తయారు చేసుకోవాలని  ఇండియన్ రక్షణ శాఖ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి భారత ఆర్మీ చీఫ్ కు మరికొన్ని అధికారాలు కూడా అప్పగించారట.


ఒకవేళ అవసరం అయితే టెటోరియల్ ఆర్మీ ని కూడా రంగంలోకి దింపించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. అయితే ఇందులోని అధికారులను సైతం నమోదు చేసుకున్నటువంటి సిబ్బందిని పిలిచేందుకు కూడా అధికారం కల్పించారు. రెగ్యులర్ ఆర్మీలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ వారిని కూడా కేంద్రం సూచించింది. ఇప్పటివరకు పలు సందర్భాలలో టెటోరియల్ ఆర్మీ ని యుద్ధంలో పాల్గొనేలా చేశారట గతంలో 1962,1965,1971 యుద్దాలలో ఇండియన్ సైన్యంతో కలిసి ఈ ట్యుటోరియల్ ఆర్మీ పనిచేస్తుందట.



ఇటీవలే కేరళ వరదలలో కూడా హీరో మోహన్లాల్ తన వంతు సేవలను అందించారు.అది కూడా టెటోరియల్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్  స్థాయిలో చేశారట. అలాగే భారత్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మరొక క్రికెటర్ సచిన్ పైలెట్ విభాగంలో.. కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, మరి కొంతమంది నటులు లెఫ్టినెంట్ కల్నాల్ స్థాయిలో ఉన్నారట. ఇందులో కనీస అర్హత సర్వీసును పూర్తి చేసుకున్న వారికి పింఛన్ తో పాటు పలురకాల అలవెన్స్ కూడా లభిస్తాయట.


ట్యుటోరియల్ ఆర్మీ గురించి పూర్తిగా చెప్పాలి అంటే దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత్ ఆర్మీతో కలిసి వీరు కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇందులో ఆర్మీ అధికారులకు మాదిరే ట్యుటోరియల్ ఆర్మీకి కూడా శిక్షణ ఇస్తారు వీరంతా కూడా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటరీగా సైన్యంతో పనిచేస్తూ ఉంటారట. ఈ చట్టాన్ని 1948లో ఆమోదించారు. ప్రస్తుతం దాదాపుగా 50,000 మంది వరకు ఈ ఆర్మీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరందరూ కూడా అవసరమైన సందర్భాలలో ప్రకృతి వైపర్యాలతో ఇబ్బంది పడుతున్న సమయాలలో రంగంలోకి దిగుతారట.

మరింత సమాచారం తెలుసుకోండి: