మాజీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంక్షేమం ఊసే లేదని ఏడాది సమయం పాటు మోసాలతోనే గడిపారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తి సైతం తగ్గిందని జగన్ కామెంట్లు చేశారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఏపీ ఆదాయం గజదొంగల జేబుల్లోకి వెళ్తోందని జగన్ కామెంట్లు చేశారు. ఏపీ రెవిన్యూ కేవలం 3.8 శాతం మాత్రమేనని బాబు అప్పుల సామ్రాట్ అని ఏడాది కాలంలోనే లక్షా 37 వేల కోట్ల అప్పు చేశాడని జగన్ చెప్పుకొచ్చారు. ఈనాడు, ఆంధ్యజ్యోతి, టీవీ5 మాఫియా రాజ్యం అని సెకీకి సన్మానం అంటూ ఈనాడులో తప్పుడు కథనాలు వండి వార్చారని జగన్ వెల్లడించారు.
 
ఈనాడు టాయిలెట్ పేపర్ కు ఎక్కువని టిష్యూ పేపర్ కు తక్కువని జగన్ పేర్కొన్నారు. ఈనాడు తీరు దున్నపోతు ఈనితే దూడను కట్టేసినట్టు ఉందని మీడియా అని చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన పరిస్థితి నెలకొందని జగన్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో అన్ని మాఫియాలు నడుస్తున్నాయని మైనింగ్ నుంచి రూపాయి కూడా రావడం లేదని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెడుతున్నారని మా హయాంలో 2.49 రూపాయలకే విద్యుత్ కొనుగోలు చేస్తే ఇప్పుడు విద్యుత్ కొనుగోలు కోసం 4.6 రూపాయలు ఖర్చు చేస్తున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలీదు కానీ ఉర్సా అనే సంస్థకు భూములు ఇచ్చారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో దోపిడీ స్కాంలకు పరాకాష్ట అని ఆయన తెలిపారు
 


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: