
మీ పార్టీలో ఉన్న పంచాయతీలు ఫస్ట్ చూసుకోండి... కన్న కూతురే లేఖ రాయడం దారుణం అంటూ... గులాబీ పార్టీని తీవ్రస్థాయిలో కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో డిఫెన్స్ లో పడింది గులాబీ పార్టీ. అయితే ఇలాంటి నేపథ్యంలో... రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఒక్క తప్పిదం కారణంగా... మళ్లీ కెసిఆర్ కుటుంబం ఏకమైంది. తాజాగా కల్వకుంట్ల తారక రామారావు కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
ఈనెల 28వ తేదీన అంటే ఎల్లుండి.. ఏసీబీ విచారణకు హాజరుకావాలని... స్పష్టం చేసింది. అయితే విదేశీ పర్యటన నేపథ్యంలో కల్వకుంట్ల తారక రామారావు.. తాను రాలేనని తేల్చి చెప్పారు. అయితే ఏసీబీ నుంచి కేటీఆర్ కు నోటీసులు రాగానే... రంగంలోకి కల్వకుంట్ల కవిత దిగారు. తన అన్నకు అండగా నిలిచారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవన్నట్లుగా.... కేటీఆర్ ఎలాంటి తప్పిదం చేయలేదని పోస్ట్ పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు కల్వకుంట్ల కవిత.
అటు హరీష్ రావు కూడా... ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన ఒక్క తప్పిదం కారణంగా మళ్ళీ గులాబీ పార్టీ నేతలు అందరూ... ఏకమయ్యారు. ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో... రంగంలోకి దిగారు ముగ్గురు బడా లీడర్లు. అయితే రేవంత్ రెడ్డి... తీసుకున్న ఈ తప్పిదం కారణంగా అన్నా చెల్లెలు మళ్లీ ఒకటయ్యారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.