దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని ఒకప్పుడు అనేవారు. అలాంటి పల్లెలకు వెళ్తే కల్మషం లేని మనుషులు, ఆహ్లాదకరమైన వాతావరణముండేది. సిటీలో ఉండేవారు పల్లెటూరుకు వెళ్లి కొన్నాళ్లైనా ఉండాలని అనుకునేవారు. అలాంటి పచ్చని కల్మషం లేని పల్లెటూర్లన్నీ కషితో రగిలిపోతున్నాయి.. పల్లెలకు పాకిన రాజకీయాలు మట్టి మనుషుల మధ్య చిచ్చులు పెడుతున్నాయి. చివరికి ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితికి దిగజారుతున్నారు పచ్చని పల్లెటూరు మనుషులు..దీంతో పట్టణాల కంటే పల్లెల్లోనే విషరాజకీయాలు ఉన్నాయని కొంతమంది పల్లెలను వదిలి పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు.ఆ వివరాలు ఏంటో చూద్దాం.. చిన్నచిన్న పల్లెటూర్లలో కూడా పెద్ద పెద్ద ఘర్షణలు జరుగుతున్నాయి. పల్నాడులో ఊచకోతలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటనలను చూసి పల్లెటూరులో నివసించే చాలామంది అమాయక జనాలు భయపడిపోయి ఊర్లలో ఉండడం మనకు సేఫ్ కాదని పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు.. ఒకప్పుడు పల్లెటూళ్లలో ఎవరో ఒకరు పెద్దమనిషిలా ఉండేవారు. ఆయన చెప్పిన వారే సర్పంచ్ లేదా ప్రెసిడెంట్ అయ్యేవారు. ఆ సమయంలో గొడవలు కూడా ఉండేవి. కానీ చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటే  ఉన్నటువంటి ఊరి పెద్ద సర్ది చెప్పి ఒకరినొకరు సముదాయించేవారు. కానీ అలాంటి పచ్చని పల్లెటూర్లలోకి  వివిధ పార్టీల పేరుతో విష రాజకీయాలు చేరుకున్నాయి. మట్టి మనిషిలా మనసులను మార్చేసాయి. ఒక్క ఊరిలో మూడు నుంచి నాలుగు పార్టీలు నాలుగు రకాల వర్గాలు తయారయ్యాయి. ఒక వర్గం ఇంకో వర్గానికి అస్సలు పడడం లేదు.

చిన్నచిన్న గొడవలు నుంచి మొదలుకొని ఒకరినొకరు చంపుకునే వరకు వస్తున్నారు.. అలా పల్లెటూర్లలో గొడవలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పార్టీలలో అధినేతగా ఉన్నటువంటి నాయకులు ఇంట్లోనే ఉంటారు కానీ వారి కింద పనిచేసే వారు ఒకరినొకరు కొట్టుకొని చస్తున్నారు. ఇక పరిస్థితులు బాలేవని చెప్పి చాలామంది జనాలు పల్లెటూర్లను వదిలి పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు. ముందుగా వారి పిల్లలను పంపిన తల్లిదండ్రులు, పరిస్థితులను తట్టుకోలేక వారు కూడా పట్టణాల వైపే వెళుతున్నారు. ఈ విధంగా పల్లెలు పూర్తిగా ఖాళీ అవుతూ పట్టణాల వైపే అడుగులు వేస్తూ పట్టణాలే సేఫ్ గా ఉన్నాయని పల్లెటూరి ప్రజలు భావించడం బాధాకరమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: