అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది.. ఓవైపు కవిత కల్లోలం..మరోవైపు హరీష్ రావు ఈటలతో సీక్రెట్ భేటీ.. ఇదంతా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణలో కనుమరుగయ్యే పని కనిపిస్తోంది అని చాలామంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీని వదిలి కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ పెట్టే ఉద్దేశం లేదని,కానీ తాను మాత్రం కేసీఆర్ నాయకత్వంలో తప్ప మిగతా ఎవరి నాయకత్వంలో కూడా నడవనని తేల్చి చెబుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈటెల రాజేందర్ తో హరీష్ రావు సీక్రెట్ గా భేటీ అయ్యారట. దీంతో రాజకీయాల్లో మరో కొత్త చర్చ జరుగుతుంది.మరి హరీష్ రావు ఈటలను ఎందుకు కలిశారు..ఆయన కూడా బిజెపిలో చేరబోతున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. అదేంటంటే.. హైదరాబాద్ శివారు లోని ఓ ఫామ్ హౌస్ లో ఈటెల రాజేందర్ ని హరీష్ రావు సీక్రెట్ గా కలిశారని.

 అయితే ఈటలని కలవడానికి కారణం ఏంటంటే జూన్లో హరీష్ రావు కేసీఆర్ ఈటెల రాజేందర్ ముగ్గురు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావలసి ఉంది.ఈ నేపథ్యంలోనే ఈటల చెప్పే మాటలపై అందరిలో ఒక ఆత్రుత ఉంది.ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు ఒకే మాట చెప్పినప్పటికీ ఈటెల మాత్రం ఏం చెప్తారని కేసీఆర్ లో ఒక భయం. ఎందుకంటే కాళేశ్వరం సమయంలో ఆర్థిక నిధులన్నీ విడుదల చేసింది ఆనాటి ఆర్థిక మంత్రి అయినటువంటి ఈటెల రాజేందరే.అందుకే ఆయనకు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అయితే ఇందులో హరీష్ రావు కేసీఆర్ ఒకే మాట చెప్పినప్పటికీ ఈటెల రాజేందర్ వేరే మాట చెబితే కేసీఆర్ ఇరుక్కుంటారు.ఈ నేపథ్యంలోనే ముందుగానే ఈ విషయం గ్రహించిన కేసీఆర్ మేనల్లుడిని ఈటల రాజేందర్ దగ్గరకి రాయబారానికి పంపి ముగ్గురు ఒకే మాట మీద ఉండాలి అని చెప్పించారట.

అయితే ఇదే విషయంపై హరీష్ రావు కూడా ఈటెల రాజేందర్ కి చెప్పి ముగ్గురం ఒకే మాట మీద ఉందాం. ఏదైనా ఉంటే తర్వాత మనం మనం చూసుకుందాం.ప్రస్తుతం ఈ గండం నుండి గట్టెక్కించు అని వేడుకున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీలో ఉన్న మహేష్ గౌడ్ చెప్పడంతో పక్కా సమాచారంతోనే ఆయన చెప్పారని, ఇవి ఉత్తి మాటలు కాదని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ఈటల రాజేందర్, కేసీఆర్,హరీష్ రావులతో కలిసి ఒకే మాట చెబుతారా.. లేక తనని పార్టీ నుంచి అవమానించి వెళ్లగొట్టిన కేసీఆర్ పై ఈటల పగ తీర్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.ఏది ఏమైనప్పటికీ తాజాగా హరీష్ రావు ఈటెల రాజేందర్ ఇద్దరూ భేటీ అయ్యారు అనే విషయం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: