
ఇక రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మార్పులను చేయడానికి కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కూడా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయాలను తీసుకున్నారు. అలా నాగబాబు ఎమ్మెల్సీగా అయ్యారు. కానీ ఇప్పటివరకు మంత్రి పదవి గురించి ఎలాంటి స్పష్టత కనిపించలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నప్పటికీ ఇందులో కొంతమంది మంత్రులు పని తీరు పైన చంద్రబాబు అసహనంతో ఉన్నారని..ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకి ఇవ్వాలని విషయంపై కొత్త చర్చ వినిపిస్తున్నది.
జనసేన నుంచి ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులుగా కొనసాగిస్తూ ఉన్నారు.. బీసీ ,ఎస్సీ వర్గాలకు సంబంధించి జనసేన నుంచి ఎలాంటి ప్రాధాన్యత కనిపించడం లేదట. ఈ విషయంపైన చాలామంది కూటమిలో పెదవి విరిస్తున్నారట.2024 ఎన్నికలలో అనకాపల్లి ఎంపీ సీటు, ఆ తర్వాత రాజ్యసభ సీటును కూడా మెగా బ్రదర్ నాగబాబు త్యాగం చేశారు.. ఈ త్యాగానికి ప్రతిఫలంగా మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. ఇతర వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ పైన చాలామంది విమర్శలు చేసి అవకాశం ఉందనే విధంగా ఆలోచనలో పడ్డారట. ఈ సీటుని విశాఖ సీనియర్ నేతకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ ఈ మంత్రి పదవి మిస్ అయితే నాగబాబుకి రాష్ట్రస్థాయిలో కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.