- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాకు కొత్త జిల్లా టిడిపి అధ్యక్షుడు రాబోతున్నాడు. చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలోని చంద్రగిరి - కుప్పం - పలమనేరు - చిత్తూరు - నగరి - గంగాధర నెల్లూరు - పూతలపట్టు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన సి ఆర్ రాజన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు పులివర్తి నాని స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజన్న అధ్యక్షుడిగా నియమించారు. తాజాగా ఆయనకు రాష్ట్ర వ‌న్నెకుల కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీంతో ఇప్పుడు భీమినేని చిట్టిబాబు - ఐరాల మండలానికి చెందిన గిరినాయుడు రేసు లో ఉన్నారు. అలాగే చిత్తూరు మండలానికి చెందిన చంద్రప్రకాష్ నాయుడు - బంగారుపాళ్యం మండలానికి చెందిన ఎస్పీ జయప్రకాష్ నాయుడు కూడా పదవి ఆశిస్తున్నారు.


అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ కూడా పదవి ఆశిస్తున్నారు. అలాగే పుత్తూరు కు చెందిన రాష్ట్ర కార్యదర్శి పోతుకుంట విజయబాబు కూడా రేసులో ఉన్నారు. వీరందరూ కూడా క‌మ్మ‌ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావటం విశేషం. అలాగే బలిజ సామాజిక‌ వర్గం నుంచి కాజూరు బాలాజీ , అలాగే దళిత కోటాలో రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ కూడా రేసులో ఉన్నారు. మరి చంద్రబాబు తన సొంత జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి కేటాయిస్తారో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: