ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ మహిళా నేత భూమా అఖిల ప్రియ అస్వస్థతకు గురయ్యారు. జాతరలో అఖిల ప్రియ స్పృహ‌ కోల్పోవడంతో.. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నె గ్రామంలో వెలసిన శ్రీ మూల పెద్దమ్మ తల్లి దేవర ఆదివారం మొద‌లైంది. జిల్లాలో ఈ దేవ‌రకు ఎంతో విశిష్టత ఉంది. సుమారు 11 ఏళ్ల త‌ర్వాత దేవ‌ర జ‌రుగుతుండ‌టంతో.. భ‌క్తులంతా ఎంతో ఉత్స‌హంగా పాల్గొంటున్నారు. గోవిందిన్నె గ్రామం జన సంద్రంగా మారింది.


ఈ రోజు ఉద‌యం భూమా అఖిల ప్రియ కూడా శ్రీ మూల పెద్దమ్మ తల్లి దేవరలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె గరుడ దీపాన్ని మోశారు. ఈ తంతు ముగిసిన కొద్ది సేప‌టికి అఖిల ప్రియ‌ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర‌మై అల‌స‌ట‌తో క‌ళ్లు తిరిగి ప‌డిపోయారు. ఇది గ‌మ‌నించిన అనుచ‌రులు మ‌రియు టీడీపీ కార్య‌క‌ర్త‌లు వెంట‌నే అఖిల ప్రియ‌ను అంబులెన్స్‌లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు వెంట‌నే ఆమెకు చికిత్స మొద‌లు పెట్టారు.


బీపీ, ఎండ వేడి కార‌ణంగా భూమా అఖిల ప్రియ స్పృహ కోల్పోయి ఉండొచ్చ‌ని వైద్యులు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు. ప్ర‌స్తుతం అఖిల ప్రియ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని స‌మాచారం. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఆమె ఆరోగ్యం విషయంలో కొంత‌ ఆందోళ‌న చెందుతున్నారు. ప‌లువురు నాయ‌కులు ఆమెను ప‌రామ‌ర్శించేందుకు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: