
నిన్న కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. ఈ సమావేశంలో విచారణకు సంబంధించిన వ్యూహాలను చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పలు దఫాలుగా న్యాయ నిపుణులు, విశ్రాంత ఇంజినీర్లతో చర్చలు జరిపి, ప్రాజెక్టు వివరాలను సమీక్షించారు. కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణం, రీ ఇంజినీరింగ్ నిర్ణయాలు, ఒప్పందాలు, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై కమిషన్ కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇప్పటివరకు 114 మందిని విచారించింది. ఈ నెల 6న మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆ తర్వాత హరీశ్‌రావును కమిషన్ ప్రశ్నించింది. ఈటల, హరీశ్‌ల వాంగ్మూలాలు, అధికారుల నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా కమిషన్ కేసీఆర్‌పై దృష్టి సారించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో లోపాలు, ఆర్థిక అవకతవకలపై కమిషన్ లోతుగా విచారిస్తోంది. ఈ విచారణ ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు