జూనియర్ ఎన్టీఆర్ కి అసలు పాలిటిక్స్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు . పాలిటిక్స్ లోకి తన పేరు లాగొద్దు అంటూ ఎన్నోసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా స్టేజ్ పై చెబుతూనే వస్తారు . కానీ కొందరు మాత్రం ఎన్టీఆర్ ని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తి పోయడానికి రెడీగా ఉంటారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ ని పాలిటిక్స్ లోకి లాగుతూ టిడిపిని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం . తాజాగా హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేతగా ఉన్న ఓవైసీ  ఎన్టీఆర్ పేరు ఎత్తడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు . అసలు అక్కడ తారక్ ప్రస్తావనే తీసుకువచ్చే సందర్భమే లేదు . కానీ ఎన్టీఆర్ ని పాలిటిక్స్ లోకి లాగుతూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . దానికి తగ్గట్టే నందమూరి ఫ్యాన్స్ కూడా ఎం ఐ ఎం అధినేత ఓవైసీకి కౌంటర్స్ ఇస్తున్నారు . అసలు ఎంఐఎం అధినేత ఓవైసీ ఎందుకు ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు..?  ఆయన పేరు చెప్పగానే సభ ఎందుకు దద్దరిల్లింది..? దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


వక్ఫ్‌ బోర్డు, వక్ఫ్‌ భూములు, వక్ఫ్‌ చట్టం పై కర్నూల్ లోనీ ఆదోనిలో ఎం ఐ ఎం ఒక సభ ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.  ఈ సభలో ఓవైసీ ..ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనేక విమర్శలు గుప్పించారు.  తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా విమర్శలు చేస్తూ వచ్చారు . "తెలుగుదేశం పార్టీ  అంటే తనకు ఎంతో గౌరవం అని .. తనకు చాలామంది సన్నిహితులు కూడా పార్టీలో ఉన్నారు అని".. చెబుతూనే  టిడిపి బాధ్యతల నుంచి చంద్రబాబు తప్పుకుంటే మంచిది అంటూ కూడా సూచించారు.



చంద్రబాబు తప్పుకొని యువనేత నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలి అంటూ సజెస్ట్ చేశారు . అంతేకాదు లోకేష్ జీవితాన్ని నాశనం చేసింది చంద్రబాబు అని .. నా మాట వింటే టిడిపి బాగుపడుతుంది అని.. చంద్రబాబు నాయుడు కొడుకు కూడా బాగుపడతాడు అని పరోక్షంగా మాట్లాడాడు . అంతేకాదు ఆయన మాట్లాడుతూ .."లోకేష్ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు ..? ఎలాగో మీరు జూనియర్ ఎన్టీఆర్ ని టిడిపిలోకి రానివ్వడం లేదు కదా..??" అంటూ మాటల సందర్భంలో లోకేష్ తో కంపేర్ చేసే మూమెంట్లో ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించారు.



అంతే..ఎన్టీఆర్ పేరు ఎత్తగానే అక్కడున్న వారు గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అసదుద్దీన్‌  షాక్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కి అంత పాపులారిటీ ఉందా..?? నాకు తెలియదే..? అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం.. టిడిపి పగ్గాలు ఎన్టీఆర్ చేపట్టే ఛాన్స్ ఉందా? అది జరుగుతుందా..? అని ఆయన అక్కడ ఉన్న వారిని కూడా ప్రశ్నించడంతో మేటర్ మరింత హిట్ పెంచేసింది.  అంతేకాదు కొంతమంది నందమూరి ఫ్యాన్స్ అసలు ఎన్టీఆర్ కి పాలిటిక్స్ అంటే ఇష్టం లేనప్పుడు ఆయన్ని ఎందుకు పాలిటిక్స్ లోకి లాగుతూ పొలిటికల్ స్పీచ్ లో ఆయనని ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు .



ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాము.. జూనియర్ ఎన్టీఆర్ ని సినిమాలకే పరిమితం కానివ్వండి ..పాలిటిక్స్ పరంగా ఆయనకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు .. దయచేసి జూనియర్ ఎన్టీఆర్ ని పొలిటికల్  రంగా కెలకదు అంటూ కొంతమంది నందమూరి ఫ్యాన్స్ కూసింత  ఘాటుగానే ఓవైసీకి కౌంటర్స్ వేస్తున్నారు.  దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎందుకో కొంత మంది జూనియర్ ఎన్టీఆర్ ని కావాలనే టార్గెట్ చేసి పొలిటికల్ పరంగా లాగుతున్నారు  అని కామన్ పీపుల్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. బహుశా అది ఆయనకి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల కూడా ఉండచ్చు అంటున్నారు సినీ రాజకీయ ప్రముఖులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: