ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ, ఆ రోజు తమ ఏమరుపాటు కారణంగా దోషులను వెంటనే అరెస్టు చేయలేకపోయామని అన్నారు. వివేకాను దారుణంగా చంపి, అంత్యక్రియలకు సిద్ధమైన వారిని అడ్డుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవని పేర్కొన్నారు. కోడికత్తి, గులకరాయి వంటి డ్రామాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని, చిన్న ఘటనలను కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు, గంజాయి బ్యాచ్‌లు, రౌడీషీటర్లను పరామర్శించే వారు ఉంటారా అని ప్రశ్నించారు. గుంటూరులో కారు కింద పడిన ఘటనను కూడా పట్టించుకోలేదని, ఇలాంటి విషయాలను రాజకీయం చేయడం సరికాదని అన్నారు. తప్పులు చేసిన వారికి ఆధారాలతో సమాధానం చెబుతామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, అందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా యుగంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. నిజం బయటకు రాకముందే అబద్ధాలు వేగంగా ప్రచారం అవుతాయని, దీనిని అడ్డుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం జరుగుతోందని, దీనిని ఖండించాలని అన్నారు. ప్రజలకు వాస్తవాలను చెప్పడంలో ప్రజాప్రతినిధులు ముందుండాలని సూచించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సొంత టీవీ, పత్రికలు నడపలేదని, ఇలాంటి ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు.

పాస్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే తామే కారణమని ఆరోపణలు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. అబద్ధాలను వ్యాప్తి చేసే వారిని ఎదుర్కోవాలని, నిజాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని చూరగొనేందుకు వాస్తవాలతో ముందుకు వెళ్లాలని, రాష్ట్ర భద్రత, అభివృ ద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: