ఇక తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులు గా సస్పెన్స్ గా ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి పై ఓ క్లారిటీ వచ్చేసింది .. ఆదివారం అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన సమయం లో ఈరోజు బీజేపీ అధిష్టానం .. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాల్సింది గా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది .. ఈ క్రమం లోనే ఆయన నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారట .. అలాగే మరి కొంతమంది నేతలు సైతం ఈరోజు 11 గంటల త‌ర్వాత‌ నామినేషన్ వెయ్యబోతున్నారు . ఇక దీంతో మరికొద్ది సేప‌ట్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవర‌నే దాని పై ఒక క్లారిటీ రాబోతుంది ..


 అయితే నిన్నటి వరకు పురందేశ్వరి ని అధ్యక్షరాలు గా కంటిన్యూ చేస్తారని అంతా అనుకున్నారు .. కానీ చివరి నిమిషం లో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు కొత్త గా తెర‌పై కి రావటం తో .  బిజెపి అధిష్టానం వ్యూహాలు ప్రజల కు రాజకీయ పార్టీల కు అంతుచికడం లేదు .. ఇప్పటి కే మరోపక్క తెలంగాణ లో ఎవరు ఊహించ‌ని విధంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర యాదవ్ కు అదృష్టాన్ని ఫోన్ చేసి .. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది .  ఇక మరి రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుడు ఎవరిని దాని పై మరికొన్ని గంటల్లోనే స్పష్టత రాబోతుంది ..



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: