
ఈ విషయం చెప్పగానే మహిళలకు కూడా తీవ్రస్థాయిలో నిరుత్సాహ పడుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి కండిషన్స్ ఏవి చెప్పకుండా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పిన కూటమి నేతలు గెలిచిన తర్వాత అన్ని కండిషన్స్ తోనే చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పినప్పటికీ ఒక్కొక్కటిగా అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు.అందుకు తగ్గట్టుగానే కండిషన్స్ అన్ని పెడుతున్నారనే విధంగా ప్రజలు కూడా విసిగిపోతున్నారు.
ఇక ఉచిత బస్సు ప్రయాణంలో ఆయన ఎలాంటి మెలిక ఉండదు అనుకుంటే జిల్లాల వారీగా అంటూ కండిషన్స్ పెట్టడంతో నిరాశలో ఉన్నారు మహిళలు. ఇటీవలే శ్రీశైలం పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.. అధికారం వచ్చిన వెంటనే పింఛన్ ని పెంచామంటూ.. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కి పెద్దవరం రాయలసీమ అభివృద్ధికి తమ దగ్గర బ్లూ ప్రింట్ ఉందంటూ.. గోదావరి నీటిని బనకచర్లకు తరలిస్తే రాయలసీమలో అసలు కరువు ఉండడంటూ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నామంటూ వెల్లడించారు. దీనివల్ల ప్రతి ఏడాది ప్రభుత్వం పైన 3,182 కోట్ల రూపాయల వరకు భారం ఉంటుందంటూ తెలిపారు.. ఏపీ మంత్రులు ఫిబ్రవరిలో కర్ణాటక వరకు వెళ్లి మరి అక్కడ పర్యటించి అక్కడ అమలవుతున్న ఈ ఉచిత బస్సు పథకాన్ని అధ్యయనం చేసిన తర్వాతే నివేదికతో ఇక్కడ అమలు చేస్తున్నామంటూ తెలిపారు.