2024 ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలలో గోల్మాల్ జరిగిందని ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే అనుమానాలు వైసిపి పార్టీకి ఉండడంతో వారు తమ దగ్గర ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లుగా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈసీకి త్వరలోనే కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వబోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ అంతట ఇదే చర్చనీయాంశంగా మారుతోంది. 2024 జరిగిన ఎన్నికలలో కూటమి పార్టీ ఏకపక్ష విజయాన్ని అందుకొని వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. చాలామంది నాయకులు గెలుస్తారనే నమ్మకం ఉన్నా ఓడిపోయారు. దీంతో చాలామంది నేతలు ఈవీఎంల పైన అనుమానం ఉన్నాయని, ఎన్నికలలో చాలా గోల్ మాల్ జరిగిందని ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించారు.

ఈ విషయం మీద కొంతమంది ప్రత్యేక విజ్ఞప్తుల మేరకు ఎలక్షన్ కమిషన్ వైసీపీ నేతలను ఆహ్వానించడం జరిగింది. తమ అభ్యంతరాలకు సంబంధించిన విషయాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఈవీఎం బ్యాటరీలు , వీవీ ప్యాలెట్ లలో పోలికలు చాలా వ్యత్యాసాలు ఉండడం ఓటింగ్ డేటా అంశాల పైన సందేహాలు ఉన్నాయన్నట్లుగా తెలిపారు. సాయంత్రం 6:00 తర్వాత చాలా నియోజకవర్గాలలో అసాధారణమైన ఓటింగ్ పెరిగిందని.. సుమారుగా 50 లక్షల ఓట్లు ఆ సమయంలో ఎలా పోలయ్యాయని అడిగారట. ఈ విషయం పైన విచారణ జరపాలని వైసీపీ పార్టీ కోరింది. అలాగే కొన్ని నియోజవర్గాలలో ఉండేటువంటి ఈవీఎం ఓట్లను, అలాగే వీవీ ప్యాలెట్  స్లిప్పులను కూడా పోల్చి చూడాలంటూ వైసీపీ పార్టీ కోరింది.

ఇక జాతీయస్థాయిలో కూడా బిజెపి వరుస విజయాల పైన ప్రతిపక్షాలకు చాలా రకాలు అనుమానాలు కూడా ఉన్నట్లు తెలియజేశారు. జాతీయస్థాయిలో కొన్ని పార్టీలు కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి ఒక సంచలన తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎక్కడ తప్పు జరిగినా కూడా ప్రభుత్వం రద్దయ్యే అవకాశం ఉంటుంది అని కానీ అంత సులువుగా జరిగే పని కాదంటూ కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: