
ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది: జూలై 30 వరకు రిటర్నింగ్ అధికారుల నుంచి ఎన్నికల నోటీసులు విడుదల, జూలై 30 – ఆగస్టు 1: నామినేషన్ల స్వీకరణ, ఆగస్టు 2: స్క్రూటినీ, ఆగస్టు 3: తిరస్కరణలపై అప్పీల్‌కు చివరి తేదీ.. ఆగస్టు 4: అప్పీల్స్ పరిష్కారం.ఆగస్టు 5: నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు, అదే రోజు తుది అభ్యర్థుల జాబితా విడుదల . ఈసారి ప్రధానంగా ఎస్ఈసీ ప్రకటించిన మేరకు, పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఒంటిమిట్ట, పులివెందుల, కుప్పం ఎంపీటీసీ పరిధిలో మణీంద్రం, అలాగే కారంపూడి, వేపకంపల్లి, విడవలూరు-1, కొండేపి, కడియపులంక వంటి ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది! : ఈ ఎన్నికలు జరగనున్న రెవెన్యూ డివిజన్, మండలాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ప్రకటనలు, నూతన పథకాలు, స్థిరాస్తుల పంపిణీ, అధికార ప్రోగ్రాంలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. హైప్రొఫైల్ ఫైట్... హైటెన్షన్ రాజకీయం! .. కుప్పం, పులివెందుల కేంద్రంగా చంద్రబాబు – జగన్ మధ్య ప్రత్యక్ష పోటీ మళ్లీ తెరపైకి రాబోతోంది. ఈ ఎన్నికల్లో ప్రజా మద్దతు ఏ పార్టీకే ఎక్కువొచ్చిందనేది రాజకీయంగా కీలక సంకేతంగా మారబోతోంది. ఎంసీటోల్లో కాదు.. ఎంపీటీసీ-జెడ్పీటీసీల నుంచే గెలుపు వ్యూహాల మొదలు అన్నట్టు రాజకీయ జోరుకు ఈ చిన్న ఎన్నికలు పెద్ద దిశ చూపించనున్నాయి!