వైసీపీ నేత కొడాలి నాని కి భారీ ఊరట లభించింది. తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు పలు రకాల ఆదేశాలను జారీ చేసింది. సీనియర్ నేత మాజీ మంత్రి  కొడాలి నాని కి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయన మీద మచిలీపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి విచారణను నిలిపివేసింది తదుపరి విచారణ కోసం వచ్చే నెలకు వాయిదా వేస్తూ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు నిన్నటి రోజున ఉత్తర్వులను జారీ చేశారు.



కొడాలి నాని గత ఏడాది జూన్ 8వ తేదీన మాజీ మంత్రి పేర్ని నాని ఇంటికి వచ్చిన విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి పోలీసులను అవమానించేలా.. వాళ్ల మనోస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారని మచిలీపట్నం ఎస్సై కే గంగాధర్ రావు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగానే టౌన్ పోలీసులు కేసు పెట్టారు. అయితే ఈ కేసు కొట్టేయాలంటూ కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈ పిటిషన్ పైన జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు.. ఇక కొడాలి నాని తరుపున న్యాయవాది శశిధర్ రెడ్డి వాదిస్తూ పిటిషనర్ పైన నమోదు చేసిన సెక్షన్లన్నీ.. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవని తెలిపారు.


ఆ సెక్షన్లన్నీ కూడా ఏవి ఈ పిటిషనర్ కి వర్తించవని తెలిపారు.. వారి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పోలీసులు మనస్థాయిని దెబ్బతీసేలా ఉన్నాయని.. పోలీసుల తరఫున ఏపీపీ నీలోత్పల్ వాదించారు.. అయితే ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తరాన జారీ చేసింది హైకోర్టు.. మరొకవైపు వైఎస్ఆర్సిపి నేతలు తులసి రఘురామ, లేళ్ల అప్పిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి లాంటివారికి ఉపశమనం లభించింది. వైసీపీ నేతలకు సంబంధించిన వేర్వేరు కేసులలో కూడా హైకోర్టు విచారణ జరిపించింది. ఈ విచారణలో భాగంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేసింది హైకోర్టు. మొత్తానికి వైసీపీ నేతలు అందరికి కొంత ఊరట లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: