ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఈరోజు ఉదయం ఒక ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది.. బల్లికురవ సమీపంలో సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న కార్మికులపై  బండరాళ్లు పడి ఆరు మంది మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకు నలుగురి మృతి దేహాలను వెలికి తీశారు.. మరో ఇద్దరి మృతి దేహాలను బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఏకంగా 16 మంది కార్మికులు ఆ క్వారీలో పనిచేస్తున్నారట.


ఇందులోని మరో పదిమందికి తీవ్రమైన గాయాలు అయ్యాయని.. మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉండే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో మరో నలుగురు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందంటూ అక్కడి వైద్యులు తెలియజేశారు. అక్కడ గ్రానైట్ సంస్థ యజమాని కార్మికుల భద్రత చర్యలు సరిగ్గా చేపట్టలేదని అధికారులు నిర్ధారించారు.. ప్రమాద ఘటన పైన బాపట్ల జిల్లా కలెక్టర్,  ఎస్పీ మీడియా అధికారికంగా మాట్లాడుతూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నామంటూ తెలియజేశారు. మృతులు ఒడిస్సా వాసులుగా గుర్తించామంటూ తెలియజేశారు.

ఈ ప్రమాదం పైన సీఎం చంద్రబాబు కూడా స్పందిస్తూ.. ఈ ఘటన పైన అధికారులను అన్ని వివరాలను అడిగి మరీ తెలుసుకున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాల పైన ఇంకా విచారణ జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఇదిలా ఉండగా బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ప్రమాదకరమైన సంఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది ముఖ్యంగా సత్యకృష్ణ గ్రానైట్ క్వారీ సంస్థ యజమానిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మికులకు సరైన భద్రత కార్యక్రమాలు చేపట్టకుండా ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయించడం ఎంతవరకు సమంజసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి అని,  అటు గాయపడ్డ వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: