
రాష్ట్రంలోని ప్రతి తల్లికి, చెల్లికి లబ్ది చేకూరేలా ఈ పథకం అమలవుతుందని మంత్రి అన్నారు. స్త్రీ శక్తి పథకానికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని కామెంట్లు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా నడుస్తున్న ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఈ పథకం అమలు కానుందని మంత్రి అన్నారు. ఈ బస్సుల్లోనే ఎక్కువమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని మంత్రి అన్నారు. ఏసీ, సూపర్ లగ్జరీ, నాన్ స్టాప్ బస్సులు తక్కువ సంఖ్యలోనే ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఆర్టీసీ ఆర్ధిక స్థితిని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంవత్సరాల పాటు అమలయేలా ఈ స్కీమ్ ఉండనుందని ఆయన అన్నారు. లక్షల సంఖ్యలో మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుందని ఉద్యోగాలు, విద్య, వైద్య సేవల కొరకు ఉచితంగా ట్రావెల్ చేయాలనీ భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు