మనలో చాలామంది వృత్తి, వ్యాపారం, ఇతర అవసరాల దృష్ట్యా చాట్ జీపీటీని వాడటానికి ఇష్టపడతారు. అయితే చాట్ జీపీటీని ఎక్కువగా వాడేవాళ్లు కొన్ని విషయాలను మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏ టెక్నాలజీ అయినా మొదట అందుబాటులోకి వచ్చిన సమయంలో అద్భుతం అని అనిపిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.

అలా టెక్నాలజీని దుర్వినియోగం చేసే వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉంటే  మంచిదని చెప్పవచ్చు. కొన్ని సోషల్ మీడియా  యాప్స్ వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నా కొంతమంది సైబర్ నేరగాళ్లు  వాటి సహాయంతోనే  మోసాలకు పాల్పడుతున్నారు. ఏఐ సృష్టికర్తలు సైతం వీటి విషయంలో చేతులు ఎత్తేస్తున్నారు. చాట్ జీపీటీ లాంటి వాటిని కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.

ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను దుర్వినియోగం చేసి కొన్ని సోషల్ మీడియా వీడియోలను తెగ వైరల్  చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయనే సంగతి తెలిసిందే.  ఇప్పటికీ చాలామందికి  చాట్ జీపీటీని ఎలా వినియోగించాలో తెలియదు. అలాంటి వ్యక్తుల చేతిలో ఇందుకు సంబంధించిన డేటా చేరితే ఆ డేటా మిస్ యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్తలు సైతం తప్పులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.  రాబోయే రోజుల్లో ఏఐ విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఏఐని మిస్ యూజ్ చేస్తే మాత్రం దానికి సంబంధించిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: