
వైసిపి కి లోక్సభలో నాలుగు ఎంపీలు రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు.. గతంలో ఎన్డీఏ సూచించిన రాజ్యాంగబద్ధమైన పదవులకు కూడా వైసిపి పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది.. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలో ఉండడంతో ఇప్పుడు జగన్ తీసుకొనే నిర్ణయం పైన చాలామంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారట. అయితే జగన్ మాత్రం తమ నేతలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామంటూ తెలియజేశారట.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ ఖర్ జూలై 21వ తేదీన పలు అనారోగ్య కారణాలవల్ల రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘం కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ జారీ చేశారు. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈ పోలింగ్ జరగబోతోంది. అదే రోజున కౌంటింగ్ కూడా జరగబోతోంది. ఎన్డీఏ తరపు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి.రాధాకృష్ణన్ ని ప్రకటించారు. ఈయన తమిళనాడు ప్రాంతానికి చెందిన సీనియర్ బిజెపి నేత. ఎన్డీఏ తమ అభ్యర్థి ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష పార్టీ అయినా ఇండియా కూటమి ఇంకా తమ అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. అయితే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఇతర పార్టీల మద్దతును కూడా పరిశీలిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాధాకృష్ణ కు మద్దతు ఇవ్వాలా లేదా అనే విషయంపై లేకపోతే పోటీగా అభ్యర్థిని ఎవరిని నిలబెట్టాలనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఏపీలో మాత్రం కేంద్రం నుంచి జగన్ కాల్ రావడంతో పెద్ద ట్విస్ట్ గా మారింది.