నిన్నటి రోజు నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వంగవీటి రంగా హత్య పైన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారుతున్నాయి. ఇటీవలే ఈ ఎమ్మెల్యే ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకమైన వ్యక్తిగా పేరుపొందిన దివంగత కాపు నేత వంగవీటి రంగా హత్య పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. వంగవీటి రంగాను కొంతమంది నాయకులు అప్పటి ప్రభుత్వంతో కలిసి 1988 డిసెంబర్ 26న హత్య చేయించారంటూ ఆరోపణలు చేశారు.అప్పుడు టిడిపి ప్రభుత్వమే అధికారంలో ఉందని ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారని హోం మంత్రిగా కోడెల శివప్రసాద్ ఉన్నారు.

రంగా తన రక్షణ కోసం నిరాహార దీక్ష చేసినప్పటికీ కూడా ఆయన హత్యను ఎవరు అడ్డుకోలేకపోయారంటూ పైరయ్యారు. రంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశారంటూ మాట్లాడారు జనసేన పార్టీ ఎమ్మెల్యే. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం కూడా చాలా బాధాకరం అంటూ తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మరో వంగవీటి రంగాగ ప్రజలు ఆదరిస్తున్నారంటూ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారని తెలిపారు జనసేన ఎమ్మెల్యే. దీంతో ఈ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి.



దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కూడా ఇరకడంలో పెట్టేలా జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన కామెంట్స్ ఉన్నాయని పలువురు నేతలు, కార్యకర్తలు తెలుపుతున్నారు. రంగ హత్యతో అటు టిడిపి పార్టీకి చాలామంది కాపులు దూరమయ్యారని ఇప్పటికి వినిపిస్తూ ఉంటాయి. రంగా హత్య విషయంపై మాత్రం ఇప్పటికీ అక్కడక్కడ కూడా చాలా మంది నేతలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ జనసేన నేత చేసిన వ్యాఖ్యలకు టిడిపి నేతలు ఎవరైనా కౌంటర్ ఇస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: