ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీపై దాడులు జరగడం కొత్త కాదనే సంగతి తెలిసిందే. గతంలో కూడా వైసీపీపై దాడులు జరగడం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయింది. చంద్రబాబు నాయుడు తాజాగా రాష్ట్రంలోని ఆరుగురు ఎమ్మెల్యేలపై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వాళ్ళ వ్యవహారాల గురించి క్యాబినేట్ లో ఫైర్ కావడం కూడా ఒకింత సంచలనం అయిందని చెప్పవచ్చు.

ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా కూడా తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇవన్నీ కేవలం కంటితుడుపు చర్యలు  మాత్రమేనని ఈ చర్యల వల్ల ఫలితం మాత్రం శూన్యమని  వైసీపీ చెబుతుండటం గమనార్హం. వైసీపీ అభ్యర్థి పురుషోత్తం రెడ్డిపై తాజాగా ఆయన ఆలయానికి వెళ్లి వస్తున్న సమయంలో దాడి జరిగింది. తనపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆ నేత చెబుతున్నారు.

తనపై దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే దాడులు చేస్తున్న వాళ్ళు ఎవరో తెలిసినా కూడా అరెస్ట్ చేస్తున్న సందర్భాలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతున్నాయని  సోషల్ మీడియా వేదికగా  హాట్ టాపిక్ అవుతోంది.  వైసీపీ సైతం ఈ దాడుల విషయంలో సీరియస్ గా ఉంది. రాష్ట్రంలో అధికారం మారితే మాత్రం  ఇదే పరిస్థితి రివర్స్ అవుతుందని హెచ్చరికలు జారీ చేస్తోంది.

రాష్ట్రంలో  ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా  ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు దాడులు చేసే పరిస్థితులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.  ఈ తరహా పరిస్థితులు దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో నష్టాన్ని  కలిగిస్తాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: