
దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యధికంగా ఆస్తులు కలిగి ఉన్న నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇటీవల సీఎంల ఆస్తులకు సంబంధించి తాజా నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఆయనకు ఉన్న ఆస్తుల విలువ దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల కంటే చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఆస్తుల విలువ అక్షరాల రూ. 931 కోట్లు అని తెలిపింది. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా కార్పొరేట్ దిగ్గజం ఆస్తులకు సరిపోతుంది.చంద్రబాబు గత కొన్నేళ్లుగా టెక్నాలజీ, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, కుటుంబ వ్యాపారాలు విస్తరించడం వల్ల ఆయన ఆస్తులు విపరీతంగా పెరిగినట్టు సమాచారం. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు – లోకేష్, భువనేశ్వరి వ్యాపారాల ద్వారానే ఎక్కువ ఆస్తులు సొంతం చేసుకున్నారని రాజకీయ వర్గాల విశ్లేషణ.
ఆస్తుల విడివిడిగా వివరాలు (2024-25 ఎన్నికల హఫ్తా ఆధారంగా)
మొత్తం ఆస్తులు: రూ. 931.84 కోట్లు
.....................................
చంద్రబాబు-గారు: ≈ ₹3.48 కోట్లు
భార్య నారా భువనేశ్వరి గారు: ≈ ₹6.83 కోట్లు
వాటి మొత్తం: ≈ ₹10.31 కోట్లు
.........................................................
మిగతా ఆస్తులు
చంద్రబాబు-గారు: ≈ ₹4.80 లక్షలు (అంబాస్డర్ కారుతో సహా)
భువనేశ్వరి గారు: ≈ ₹810.37 కోట్లు, ఇందులో ప్రధానంగా హెరితగె Fఊద్స్ ళ్త్ద్ షేర్లు ఉన్నాయి (₹763.93 కోట్లు)
ఇతర విలువైన వస్తువులు: బంగారం ≈ 3.4 కిలో, వెండి ≈ 41.5 కిలో, ముత్కాలు/రతనాలు (₹1.09 కోట్లు)
3. స్థిర ఆస్తులు :
చంద్రబాబు-గారు:
కుప్పం సమీపంలోని కడపల్లి లో 95.23 సెంట్ల స్థలం – ₹77.33 లక్షలు
హైదరాబాదులో జూబ్లీ హిల్స్‌లో సంయుక్తంగా ఉండే ఇంటి నిర్మాణం (తండ్రితో భాగం): ₹70.20 కోట్లు (ఈ మొత్తంలో అర భాగం ఆయనకు)
తిరుపతి చుట్టుపక్కల ఉన్న వారసాస్తుతమైన 0.97 ఎకరాల స్థలంలోని గృహం: ₹43.66 లక్షలు
మొత్తం: ≈ ₹36.31 కోట్లు
భువనేశ్వరి గారు:
హైదరాబాదులోని మడినగూడలో 5 ఎకరాల స్థలం: ₹55 కోట్లు
చెన్నై (స్రిపేరుంబదు)లో వాణిజ్య భవనం: ₹30.10 కోట్లు
మొత్తం: ≈ ₹85.10 కోట్లు
....................................................
4. షేర్లు (డిఫరెంటు కంపెనీలు)
Heritage Foods Ltd:
భార్య భువనేశ్వరి గారు సుమారుగా 2.26 కోట్ల షేర్లు కలిగిఉన్నట్లు, వాటి విలువ సుమారు ₹764 కోట్లు
ఇది మొత్తం ఆస్తులలో ఎక్కువ ఇన్ కమ్ తెచ్చిపెడుతుంది.
కంపెనీలు/బిజినెస్ లింక్:
Heritage Foods Ltd ఒక ఫ్యామిలీ–నడిపే డైరీ వ్యాపారం, భువనేశ్వరి గారు ండ్ గా ఉంటున్నారు, ఇది ఆస్తిలో ప్రధాన స్థానాన్ని పొందింది
....................................................................................................................
ఇప్పటికే రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా తన ఆస్తుల విలువ పెరగడంలోనూ ముందున్నారు. దేశంలోనే అత్యధిక ధనిక ముఖ్యమంత్రి అనే రికార్డు ఇప్పుడు ఆయన ఖాతాలో చేరడం విశేషం.ఈ రికార్డు మరోసారి ఆయన రాజకీయ ప్రాధాన్యాన్ని, వ్యాపార దృష్టిని బయటపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఒకవైపు ప్రజల సమస్యలు, పేదల సంక్షేమంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మొత్తానికి, దేశంలో అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు పేరు నిలవడం ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు.