
ప్రకాశం జిల్లాలో జరిగే సొంత జనసేన కార్యక్రమాలకు కూడా బాలినేని పిలవడం లేదు. దీంతో ఇప్పుడు ఈ మాజీ మంత్రి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనసేన పార్టీలోకి చేరిన బాలినేనికి ఒరిగిందేమీ లేదంటూ ప్రకాశం జిల్లా రాజకీయా వర్గాలలో వినిపిస్తోంది. బాలినేని వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒంగోలులో టిడిపి ,జనసేన నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టి వేధించారనే విషయం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. టిడిపి ఎమ్మెల్యే దామచర్ల, జనసేన పార్టీ నాయకులు బాలినేని జనసేన పార్టీలోకి చేరికపై గతంలో వ్యతిరేకంగా కూడా మాట్లాడారు.
కానీ పవన్ కళ్యాణ్ తో ఉన్న గుర్తింపుతో పార్టీలోకి ఆహ్వానించిన నేతల సైలెంట్ అయ్యారు. బాలినేనికి వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరిన ఆనందం ఎక్కడ కనిపించడం లేదు. కూటమిలో టిడిపి, జనసేన నేతలు బాలినేని లోకల్ గా వ్యతిరేకించడంతో ఒంగోలుకి దూరంగా ఉంటున్నారు. బాలినేని పై మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాలినేని ఒక మంచి నాయకుడు అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇదొక్కటే బాలినేనికి ఆనందం కలిగించే విషయం. ఇటీవలే జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజుకు ఒంగోల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టు లభించడంతో ఇటీవలే అట్టహాసంగా పదవి బాధ్యతలను స్వీకరించారు.
రాష్ట్రంలో ఉండే జనసేన నేతలతో పాటు, టిడిపి, బిజెపి నాయకులు ఆహ్వానాలను పంపించారు. కానీ లోకల్ నాయకుడు అయిన బాలినేనికి మాత్రం ఆహ్వానం అందకుండా పోయింది. తన అనుచరులకు కూడా అందకపోవడంతో వీరందరూ అవమానంగా ఫీల్ అవుతున్నారు. టిడిపి ఎమ్మెల్యే దామచర్ల సహకారంతోనే తమకు ఒడా చైర్మన్ పదవి వచ్చిందని భావిస్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆహ్వానాలను కూడా టిడిపి ఎమ్మెల్యే చెప్పినట్టుగానే చేసినట్లుగా వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా షేక్ రియాజ్ కు సంబంధించి శుభాకాంక్షలు చెబుతూ జనసేన పార్టీ పెట్టిన ఫ్లెక్సీలలో కూడా బాలినేని ఫోటో ఎక్కడ కనిపించలేదంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. గత ఎన్నికలలో దామచర్ల చేతిలోనే బాలినేని ఓడిపోయారు. 20 ఏళ్లుగా బాలినేని, దామచర్ల మధ్య రాజకీయ వైర్యం ఉన్నది. ఇన్ని రోజులు టిడిపి వర్సెస్ జనసేన గా మారిన ఈ యుద్ధం.. ఇప్పుడు జనసేన వర్సెస్ జనసేనగా మారిపోయింది. ఒంగోలు టిడిపి ఎమ్మెల్యేతో కలిసి ఉండే జనసేన గ్రూపు ఒకటి కాగా.. రెండవది బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం.. కూటమిలో ఒకటిగా ఉన్నప్పటికీ అటు బాలినేని ,దామచర్ల మధ్య వైర్యం మాత్రం తగ్గడం లేదు. ఏడాది పాటు ఒంటరి పోరాటం చేస్తున్న బాలినేని తిరిగి పవర్ పాలిటిక్స్ చేస్తారో లేదో చూడాలి.