ఏపీ అంతట పిఠాపురం వర్మగా టిడిపి నేత పేరు ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది..మాజీ ఎమ్మెల్యే , పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. పార్టీ పరంగా ఎంతో కష్టపడుతూ ఉంటారు వర్మ. టిడిపి పార్టీ పిఠాపురంలో గట్టిగా నిలబడడానికి ముఖ్య కారణం వర్మానే చెప్పవచ్చు. అలాంటి వర్మకు కూడా ప్రమాదం పొంచి ఉందనే చర్చ ఇప్పుడు కొనసాగుతోంది. దీంతో పిఠాపురం వర్మ కూడా తన వ్యక్తిగతంగా ప్రమాద భయం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖను రాశారు.



ఆలేఖలో తనకు తగిన భద్రత కల్పించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లుగా సమాచారం. వర్మ కోరిక మేరకే ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు వ్యక్తిగత భద్రత కల్పించేందుకు వన్ ప్లస్ వన్ గన్ మాన్ లను కూడా కేటాయించారు. వర్మకు శత్రువులుగా రాజకీయ ప్రత్యర్థులు తప్ప మరెవరూ లేరని ఆయన అభిమానులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు. వర్మ కు ఎవరి నుంచి ముప్పు ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవనే విధంగా వినిపిస్తున్నాయి. కేవలం వర్మ ఇంటెలిజెన్స్ అభిప్రాయం ప్రకారమే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారంటూ అభిప్రాయపడుతున్నారు.



గత కొంతకాలంగా వర్మ ఎమ్మెల్సీ ప్రధాని ఆశిస్తున్నారని అయితే అది ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. గతంలో నామినేటెడ్ పదవి కూడా ఇస్తారని చెప్పినా దక్కడం లేదని బాధ ఆయన అనుచరులలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ ఆధీనంలోనే ఉన్నది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి న్యాయకత్వం వ్యవహరిస్తున్నారు. దీంతో అటు కూటమిలో టిడిపి ,జనసేన మధ్య కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వర్మకు ముప్పు తెచ్చేంతగా లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనాప్పటికీ వర్మ ఇకమీదట గన్ మాన్లతోనే కనిపించబోతున్నారు. ఈ విషయం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా  మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: