
నేపాల్ కమ్యూనికేషన్ సమాచారం మంత్రిగా ఉన్న పృథ్వి సుబ్బు గురుంగు ఈ విషయం పైన మాట్లాడుతూ ప్రజలు విస్తృతంగా ఉపయోగించేటువంటి యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ తో సహా 26 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ల ను ప్రభుత్వం బ్యాన్ చేసిందంటూ తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఫాలో కాకపోవడం వల్లే వీటిని నిషేధం విధించామంటూ తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ కంపెనీలకు పదేపదే హెచ్చరించిన కూడా వారి విఫలమయ్యారు. దీంతో ఆ కంపెనీల పైన నిషేధం విధించినట్లుగా తెలిపారు.
టిక్ టాక్, వైబర్ తో సహా కేవలం 5 ఫ్లాట్ ఫారమ్లు మాత్రమే ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్నాయని వాటిపైన ఎలాంటి నిషేధం విధించలేదంటూ తెలియజేశారు. నేపాల్లో పనిచేసేటువంటి దేశ, విదేశీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్లకు సంబంధించి ప్రత్యేకించి ఒక వ్యక్తిని నియమించేలా ఆదేశాలను జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఒక బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం సెప్టెంబర్ 3- 2025 వరకు డెడ్ లైన్ విధించింది. అయితే ఈ విషయం పైన కొంతమంది నేపాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ వేయగా కోర్టు కూడా కచ్చితంగా ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లను హెచ్చరించింది. దీంతో గడువు ముగిసిన నేపథ్యంలో 26 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో బ్యాన్ విధించింది నేపాల్ ప్రభుత్వం.