ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరగగా కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని అందుకుంది.కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి గోరంగా ఓటమి తర్వాత ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే విషయంపై పలు రకాల సర్వేలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ప్రజలలో సానుకూలత వైసిపి పార్టీకి పెరిగిందా? లేదా అనే విషయంపై వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై వైసీపీ నిర్వహించినటువంటి సర్వేలలో ఆ పార్టీకి ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చినట్లు వెల్లడిస్తున్నారు. ఏపీ అంతట వైసీపీ పార్టీ పరిస్థితి పైన చేసిన సర్వేలో వైసీపీ పార్టీకి కొంత ఊరట కలిగించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ పార్టీ బాగా పుంజుకున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా ,కడప జిల్లాలో జరిగిన జడ్పిటిసి ఉప ఎన్నికలలో వైసిపి చాలా ఘోరంగా ఓడిపోయింది. దీంతో వైసిపి పార్టీ బలహీన పడిందనే అనుమానాలు మొదలవుతున్న సమయంలో తాజా సర్వేలో ఆ పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.


రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మినహాయిస్తే మిగిలిన మూడు ఉమ్మడి జిల్లాలలో కూడా వైసిపి పార్టీ పుంజుకున్నట్లు సర్వేలో బయటపడిందని చెబుతున్నారు. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలో వైసీపీకి మునుపటి పరిస్థితి ఉండబోతోందని ,ఈ ఉమ్మడి జిల్లాల్లో వైసీపీకి మళ్ళీ 50 శాతం వరకు ఓటు బ్యాంకింగ్ సంపాదించే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో వెళ్లడైందని చెబుతున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో అయితే కూటమితో నువ్వా నేనా అన్నట్టుగా తలపడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న వైసిపి పరిస్థితులలో ఈ సర్వే కాస్త జోష్ నింపేలా కనిపిస్తోందని చెబుతున్నారు. రాయలసీమలో నాలుగు ఉమ్మడి జిల్లాలలో 52 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ.. ఇందులో 30 సీట్లు వైసీపీ ఆధిపత్యం దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాలలో 60 సీట్లు వస్తే సరిపోతుందని వ్యూహంతో ముందుకు వెళ్లాలా వైసిపి పనిచేస్తున్నట్లు రాజకీయాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ సర్వే ఎంతవరకు నిజం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: