ఇప్పుడు ఎక్కడ చూసినా సరే వచ్చే నెలలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి రాజకీయ వర్గాలు, ప్రజలు, మీడియా అంతా మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందా? లేక ఇండియా కూటమి ఆధిక్యం సాధిస్తుందా? అనే అంశంపై పలు రకాల సర్వేలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్ అవుతున్నాయి.బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 243 స్థానాలకుగాను బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. అదే సమయంలో కేంద్రమంత్రి చిరాగ్ పస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో పోటీ చేయనుందని అధికారికంగా ప్రకటించారు.ఇక రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, హిందుస్తానీ అవామ్ మోర్చా వంటి మిత్రపక్షాలు కూడా తమకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ధృవీకరించాయి. ఈ సీట్ల కేటాయింపుల విషయాన్ని బీహార్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.


అయన మాట్లాడుతూ..“ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు ముగిశాయి. ప్రతి పార్టీకి న్యాయం జరిగే విధంగా సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. ఈ కూటమి మరోసారి బీహార్‌లో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుంది,”అని ధర్మేంద్ర ప్రధాన తెలిపారు .ఆయన మాటలతోపాటు ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు కూడా ఈ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతించారు. “బీహార్ సిద్ధంగా ఉండండి – ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఏర్పడబోతోంది” అని ప్రధాన చేసిన వ్యాఖ్య ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



అయితే ఈ మొత్తం రాజకీయ సమీకరణల్లో ఒక పేరు మాత్రం విశేషంగా వినిపిస్తోంది — అదే చిరాగ్ పస్వాన్.  చిరాగ్ పస్వాన్ బీహార్ రాజకీయాల్లో ఒక కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు. ఆయన మొదటి నుంచే ఎన్డీఏ కూటమికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ, తమ పార్టీకి కనీసం 30 సీట్లు కావాలని స్పష్టంగా ప్రకటించారు. “మాకు 30 సీట్లు ఇవ్వకపోతే పోటీ చేయం,” అని ఆయన పదేపదే బీజేపీ ముందు చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ధృఢమైన వైఖరి, వ్యూహాత్మక రాజకీయ నడతల వలన బీహార్ ఎన్డీఏ లోపల కూడా ఒక కొత్త డైనమిక్ ఏర్పడింది. బీజేపీతో సుదీర్ఘ చర్చల అనంతరం చివరకు 25 సీట్లు నుంచి 29 సీట్ల వరకు సర్దుబాటు చేసుకోవడంలో చిరాగ్ కీలక పాత్ర పోషించారు.ఈ క్రమంలో చిరాగ్ పస్వాన్ నైపుణ్యం, ఆయన రాజకీయ పట్టుదల కారణంగా బీహార్ మీడియా ఆయనను ప్రశంసిస్తుంది.



“మోడీని కూడా ఒప్పించగల లీడర్”అని పేర్కొంటూ ఆయనను హైలైట్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా, న్యూస్ చానెల్స్ అంతా “చిరాగ్ పస్వాన్ — ఎన్డీఏలో కొత్త శక్తి” అనే ట్యాగ్‌తో నిండిపోయాయి. బీహార్‌లో ఆయన పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతూ వైరల్ సెన్సేషన్గా మారింది. తుది దశలో చూస్తే, ఈ ఎన్నికలు కేవలం బీజేపీ లేదా ఇండియా కూటమి మధ్య పోటీ మాత్రమే కాదు — బీహార్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే సమరంగా మారాయి. ప్రజల మనసుల్లో ప్రస్తుతం ఒకే ప్రశ్న మార్మోగుతోంది —“ఎవరికి బీహార్ అధికారం?”..!!

మరింత సమాచారం తెలుసుకోండి: