
ఆ హీరోయిన్ ఎవరో కాదు ఈషా రెబ్బా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో ఈమె ప్రేమలో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి గతంలో తిరుపతికి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఇప్పుడు ఏకంగా ఇద్దరు కలిసి దీపావళి పండుగని జరుపుకుంటున్నట్లు కొన్ని ఫోటోలను షేర్ చేయగా దీంతో వీరి మధ్య ఏదో ఉందంటూ మళ్ళీ రూమర్స్ వినిపిస్తున్నాయి. హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్న సందర్భంగా వీరిద్దరూ అక్కడ కనిపించారు.దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అనే సందేహం అభిమానులలో మొదలవుతోంది..
ఈషా రెబ్బా సక్సెస్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. వాస్తవంగా తెలుగమ్మాయి అయినప్పటికీ అందం అభినయం ఉన్నప్పటికీ ఎందుకో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అయితే ఎక్కువగా ఈమెకు సెకండ్ హీరోయిన్ గా మంచి అవకాశాలు లభించాయి. అలా గుర్తింపు ఇచ్చిన చిత్రమే అరవింద సమేత.ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి అద్భుతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయింది. మరి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో ప్రేమ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. ఈ విషయం విన్న అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.