తమిళ నటుడు సూర్య ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈయన నటించిన చాలా సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అందులో కొన్ని మూవీ లు అద్భుతమైన విజయాలను తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా సొంతం చేసుకున్నాయి. దానితో ఈయన కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికి తెలిసిందే.

అందులో భాగంగా సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాను కూడా కొంత కాలం క్రితం తెలుగులో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇకపోతే సూర్య నటించిన మరో సినిమాను కూడా తెలుగులో రీ రిలీజ్ చేయబోతున్నారు. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం సూర్య , కె వి ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన వీడొక్కడే అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో తమన్నా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మూవీ ని మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను నవంబర్ 22 వ తేదీన రిలీస్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు  తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి. ఈ సినిమాలో సూర్య , తమన్నా జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఆ సమయంలో మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: