సినీ ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో తమని తాము నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి ,విడాకులు అనేవి చాలా కామన్ గానే వినిపిస్తూ ఉంటాయి. హీరో హీరోయిన్స్ మధ్య ఎఫైర్ రూమర్స్ కూడా చాలానే వినిపిస్తూ ఉంటాయి. మరి కొంతమంది రెండు మూడు ఎఫైర్స్ పెట్టుకున్నారనే విధంగా వినిపిస్తుంటాయి. అయితే ఇదంతా ఇలా ఉండగా తాజాగా టాలీవుడ్ అందాల బ్యూటీ తన ఎఫైర్స్ గురించి ఓపెన్గానే చెప్పి అందరికీ సడన్ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తాను గతంలో నలుగురితో ప్రేమాయణం నడిపాను అంటూ తెలియజేసింది.


ఆమె ఎవరో కాదు టాలీవుడ్ లోనే హాట్ బ్యూటీగా పేరుపొందిన ముమైత్ ఖాన్.  తాను నలుగురితో ప్రేమాయణం నడిపిన ఏ ఒక్కరు కూడా తన దగ్గర కరెక్ట్ గా లేరు అంటూ వెల్లడించింది. అందుకే వారికి బ్రేకప్ చెప్పేసానని , ప్రస్తుతం తన జీవితాన్ని చాలా ఆనందంగా గడిపేస్తున్నానని ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి అనేది రాసిపెట్టి ఉంటే చేసుకుంటానని లేకపోతే లేనని వెల్లడించింది. ఇదంతా కూడా గతంలో ఒకానొక ఇంటర్వ్యూలో ఈ విషయాలను బయటపెట్టింది ముమైత్ ఖాన్. ముఖ్యంగా ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్స్  లో తన అంద చందాలతో కుర్రాలను ఉర్రుతలు ఊగించింది. ముమైత్ ఖాన్ స్పెషల్ సాంగ్ ల ద్వారానే సినిమాలు ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.


ముమైత్ ఖాన్ తెలుగు అనే కాకుండా హిందీ ,తమిళం వంటి భాషలలో కూడా అదరగొట్టేసింది. హీరోయిన్ గా కూడా కొన్ని చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేదు. ఆమధ్య తెలుగు బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసిన ముమైత్ ఖాన్ అలాగే ఒక డాన్స్ షోకు జడ్జిగా కూడా వ్యవహరించింది. గడిచిన కొన్ని నెలల క్రితం తనకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని ఆ తర్వాత కొన్ని నెలలకి   తాను కోలుకున్నానంటూ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: