
కుక్కలు కేవలం పెంపుడు జంతువులు మాత్రమే కాదు, అవి మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన స్నేహితులు. ఇంట్లో కుక్కలను పెంచుకోవడం వల్ల అనేక శారీరక, మానసిక, సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి. కుక్కలతో గడపడం, వాటితో ఆడుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన కలిగించే కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు తగ్గి, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
ఒంటరిగా ఉన్న వారికి కుక్కలు మంచి తోడును అందిస్తాయి. తమ భావోద్వేగాలను పంచుకునేందుకు ఒక జీవి పక్కన ఉందనే భావన మనసుకు ధైర్యాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కుక్కలను పెంచుకునేవారిలో డిప్రెషన్ లక్షణాలు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కుక్కలను ప్రతిరోజూ వాకింగ్‌కు తీసుకెళ్లడం, వాటితో ఆటలాడటం వల్ల యజమానులకు కూడా చక్కటి శారీరక వ్యాయామం లభిస్తుంది. దీనివల్ల బరువు అదుపులో ఉండి, చురుకుగా ఉంటారు. కుక్కలను పెంచుకునే వారిలో రక్తపోటు అదుపులో ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కుక్కలను బయటకు తీసుకెళ్లినప్పుడు, పార్కులలో లేదా వాకింగ్ ప్రాంతాలలో ఇతర కుక్కల యజమానులతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఇది సామాజిక సంబంధాలను పెంచుకోవడానికి దోహదపడుతుంది. కుక్కలు ఇంటికి, కుటుంబ సభ్యులకు మంచి కాపలాగా ఉంటాయి. అపరిచితులు లేదా ప్రమాదాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తాయి పిల్లలు కుక్కలను చూసుకునే బాధ్యతను నేర్చుకుంటారు. ఇది వారిలో దయ, బాధ్యత, స్నేహం వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తుంది. కుక్కలు ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని అందిస్తాయి. వాటి ఆలనా పాలనా చూస్తూ గడిపే సమయం జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిని ఇస్తుంది. అందుకే చాలామంది కుక్కలను తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా భావించి పెంచుకుంటారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు