పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లో నటించరు. కేవలం ఆయన ఒప్పుకున్న మూడు ప్రాజెక్టులు మాత్రమే ఫినిష్ చేస్తారు అని చాలా రోజుల నుండి వార్తలు వినిపించాయి. కానీ సడన్ గా ఆయన నటించిన హరిహర వీరమల్లు మూవీకి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. అలాగే ఓజి మూవీకి కూడా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అలా మూడు అనుకుంటే అందులోకి మరో రెండు వచ్చి చేరాయి.అయితే వీటితోపాటు మరో సినిమాకి కూడా ఓకే చెప్పారటపవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాతగా..పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన వకీల్ సాబ్ మూవీకి దిల్ రాజు నిర్మాతగా చేశారు. అయితే మరోసారి వీరి కాంబో రిపీట్ అవ్వబోతున్నట్టు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారని, పవన్ కళ్యాణ్ దిల్ రాజు కాంబోలో రాబోతున్న సినిమాలో పవన్ అలాంటి పాత్రలో ఫస్ట్ టైం నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ పోషించబోయే ఆ పాత్ర ఏంటి అంటే లెక్చరర్.. అయితే దిల్ రాజు నిర్మతగా చేస్తున్న ఈ మూవీకి అనిల్ రావిపూడిని దర్శకుడిగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే అనిల్ రావిపూడి బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లని డైరెక్షన్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కూడా డైరెక్షన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలా పవన్ కళ్యాణ్ కోసం అనిల్ రావిపూడి రెండు స్క్రిప్ట్ లను  రెడీ చేశారట.అందులో ఓ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చడంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారట.అయితే ఆ స్క్రిప్ట్ లో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

అలా కాలేజీ లెక్చరర్ గా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తూ కోర్టు వేసుకొని వాదించడం తెలుసు కోర్టు తీసి కొట్టడం తెలుసు.. బుక్ పట్టి చదువు చెప్పడం తెలుసు అంటూ ఓ డైలాగ్ చెబుతున్నారు. అంతేకాదు లెక్చరర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఇక థియేటర్లో బ్లాస్టే రాసి పెట్టుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ నిజంగానే లెక్చరర్ పాత్ర పోషించబోతున్నారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: