ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ఉద్యోగులు, పింఛనీదారులకు దీపావళి కానుకగా DA ను పెంచుతూ ఉత్తరులను జారీ చేసింది. గత ఏడాది 2024 జనవరి 1 నుంచి 3.64 % DA అలవెన్స్ ని పెంచుతూ ఉత్తరులను జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయిన పీయూష్ కుమార్ ఉత్తరులను జారీ చేశారు. అలాగే కొత్త డిఏలతో పాటుగా సంబంధిత బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నామంటూ ఏపీ ఆర్థిక శాఖ తెలియజేసింది.


ప్రస్తుతం నాలుగు పెండింగ్ లో ఉన్న డీఏ లకు గానూ ఒక డిఏ ను ఇవ్వడానికి ఒప్పుకుంది ఏపీ సర్కార్. నవంబర్ 1 నుంచి DA అందబోతోంది. దీని ప్రకారం ప్రతి నెల కూడా  రూ.160 కోట్ల రూపాయల వరకు అదనంగా ఏపీ ప్రభుత్వం ఖర్చు అవుతుందంటూ తెలియజేస్తోంది. అలాగే మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ ను 180 రోజులు ఇస్తున్నట్లు తెలియజేస్తున్నారు . రిటైర్డ్ అయ్యేలోపు ఎప్పుడైనా సరే ఈ చైల్డ్ కేర్ లీవ్ ను తీసుకునే సదుపాయాన్ని కల్పించారు


మొత్తం మీద ఉద్యోగులు ఏపీ రాష్ట్ర రెవెన్యూలో 99.50%  వరకు జీతభత్యాలను పొందుతోందని తెలిపారు. రూ. 51,200 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఉద్యోగులకు జీతాలకు ఖర్చు చేయవలసి వస్తోందని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలలోని ఎక్కడా కూడా ఇంత ఖర్చు చేయలేదని వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం రూ. 51,400 కోట్ల రూపాయలు అయితే ఉద్యోగుల జీతమే రూ. 51,200 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు.అ 16 నెలల నుంచి ఉద్యోగులకు సకాలంలోనే జీతాలు చెల్లిస్తున్నాము, బకాయిలు తీర్చామంటూ తెలిపారు. ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్న దీపావళి ముందు ఉద్యోగులకు శుభవార్త చెప్పామని సీఎం చంద్రబాబు తెలిపారు . దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ,అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ క్లియర్ చేస్తామంటూ తెలిపారు. ఉద్యోగ సంఘాల భవనాలకు ఆస్తి పన్ను మాఫీ కూడా చేశామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: