ఏంటి డీజే టిల్లు మూవీకి సూపర్ స్టార్ కృష్ణ గారికి మధ్య అనుబంధం ఉందా.. ఇదెక్కడి రిలేషన్ అని అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది. అంతేకాదు ఈ విషయం తెలిస్తే కృష్ణ  గొప్పతనం గురించి మీరు పొగడక మానరు.మరి ఇంతకీ కృష్ణ చేసిన పనేంటి..డిజే టిల్లు మూవీకి కృష్ణకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. సరిగ్గా 45 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి సినిమాల మీద ఉన్న పిచ్చితో సినిమా సెకండ్ షో చూసి మద్రాస్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎక్కడ ఉండాలో తెలియక సూపర్ స్టార్ కృష్ణ ఇంటి దగ్గరికి వచ్చి నిల్చోవడంతో విజయ నిర్మల,కృష్ణ చూసి అతన్ని దగ్గరికి పిలిచి ఎవరు నువ్వు అని అడగగా..నేను అనాధని నాకు ఎవరూ లేరు అని చెప్పారట. దాంతో ఆ పిల్లవాడిని చూసి కృష్ణ మనసు చలించిపోయి మా ఇంట్లోనే ఉండు అని చెప్పి కొత్త బట్టలు కొనిచ్చి తినడానికి తిండి పెట్టి సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు. అలా దాదాపు నాలుగు నెలల పాటు ఆ వ్యక్తి కృష్ణ ఇంట్లోనే ఉన్నాడు. 

ఇక ఆ వ్యక్తి పేరెంట్స్ కేసు పెట్టడంతో పాటు పలు పత్రికల్లో ప్రకటన ఇవ్వడంతో చివరికి కృష్ణ ఇంట్లోనే తన కొడుకు ఉన్నాడు అని నిజం తెలుసుకొని కృష్ణ ఇంటికి వచ్చారు.ఆ తర్వాత కృష్ణ ఆ వ్యక్తిని తల్లిదండ్రులకు అప్పజెప్పి బాగా చదువుకొని ఆ తర్వాత సినిమాల గురించి ఆలోచించు అని మంచి మాటలు చెప్పారట. ఇక కృష్ణ ఆ రోజు చెప్పిన మాటలు అతని బుర్రకి బాగా ఎక్కి ఉన్నత చదువులు చదివి ఎంతో పై స్థాయికి ఎదిగారు.ఇక ఈయనలాగే ఈయన కొడుకు కూడా సినిమాల మీద ఉన్న ఇష్టంతో చదువులు వద్దు సినిమా రంగంలోనే రాణిస్తానని చెప్పారు. అలా సినిమా రంగంలో రాణించి చివరికి డీజే టిల్లు అనే సినిమా తీశారు.

ఇక ఈ స్టోరీ అంతా ఎక్కడిది అంటే డీజే టిల్లు మూవీ కి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణది.. ఈ విమల కృష్ణ తండ్రి sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ చిన్నతనంలో ఇంటి నుండి పారిపోయి కృష్ణ ఇంట్లో నాలుగు నెలలు పెరిగారు. అలా కృష్ణ ఇంటి నుండి వచ్చాక కృష్ణ చెప్పిన మాటలు విని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లి తనకు పుట్టిన పిల్లలకు విమల్ కృష్ణ, రమ్యకృష్ణ అని కృష్ణ పేర్లు కలిసేలా పెట్టి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అలా sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ కొడుకు విమల్ కృష్ణ సినిమాల్లోకి వచ్చి డీజే టిల్లు మూవీకి దర్శకత్వం వహించి మొదటి మూవీ తోనే స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలా కృష్ణ చేసిన ఈ గొప్ప పని చాలామందికి తెలియదు.. ఈ ఒక్క విషయంతో కృష్ణ మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఈ విషయం తెలిసిన ఆయన ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: