నందమూరి బాలకృష్ణ కొంత కాలం క్రితం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... శ్రీ లీల ఓ కీలకమైన పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2023 వ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా ఆ సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదల అయ్యి నిన్నటితో రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విజయవంతంగా రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ సినిమా ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 19.75 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 13 కోట్లు , ఉత్తరాంధ్ర లో 6.50 కోట్లు , ఈస్ట్ లో 3.64 కోట్లు , వేస్ట్ లో 2.95 కోట్లు , గుంటూరు లో 5.56 కోట్లు , కృష్ణ లో 2.70 కోట్లు , నెల్లూరు లో 2.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 56.86 కోట్ల కనెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 5.8 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సిస్ లో 7.35 కోట్లు కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 70.01 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 60.01 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 61 టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగి ... 9.01 కోట్ల లాభాలను అందుకొని ఆ సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: