సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్తగా హీరోయిన్లుగా వచ్చేవారు, మొదట తమ కెరీర్ ను సురక్షితంగా ఉండేలా చూసుకోవడం.. అవకాశాలను స్థిరంగా పెంచుకోవడం అన్న విషయంలో ఎక్కువగా దృష్టి పెడతారు. ప్రతి హీరోయిన్ విషయంలో మనం ఇది చూస్తూనే ఉంటాం.  ఎక్కువ మంది హీరోయిన్లు, ప్రత్యేకంగా తమ మొదటి కొన్ని సినిమాల తర్వాత, ఒక్కసారిగా ఐటెం సాంగ్ చేసే ఆలోచనకు దూరంగా ఉంటారు.  దానికి వన్ అండ్ ఓన్లీ కారణం వాళ్ల  ఫ్యూచర్ కెరియర్.  ఇండస్ట్రీకి ఇప్పుడప్పుడే వచ్చి, స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఐటెం సాంగ్ చేస్తే, భవిష్యత్ సినిమాలకు, ప్రధాన పాత్రలకు ఆఫర్లు రావడం ఆగిపోతాయి ఏమో అని చాలా మంది ఐటెం సాంగ్ కి నో చెప్తూ ఉంటారు. ఈ అభిప్రాయం ప్రతి హీరోయిన్‌కు ప్రామాణికంగా ఉంటుందనడం ఆశ్చర్యం కాదు.

ఇప్పటివరకు కీర్తి సురేష్, రష్మిక మందన్నా వంటి ప్రముఖ హీరోయిన్లు, ఐటెం సాంగ్ చేయకుండానే ముందుకు వచ్చారు. ఎందుకంటే ఐటెం సాంగ్ చేయడం వల్ల, ముఖ్య పాత్రల్లో అవకాశాలు తగ్గిపోవచ్చనే భయం వారిలో ఉంది. అందుకే, ఈ అవకాశాలు కోట్ల రూపాయల ఆఫర్లు వచ్చినా కూడా వారు వాటిని వదిలివేస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు స్టార్ హీరోయిన్ మీనాక్షి మాత్రం ఈ విషయంలో ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మీనాక్షి చౌదరి, తన కెరీర్ ప్రారంభ దశలోనే, ఐటెం సాంగ్ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం ఫిల్మ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు కారణమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వివరాల ప్రకారం, సంక్రాంతి కి వస్తున్నాం సినిమా తరువాత మీనాక్షి చౌదరి కి సూపర్ డూపర్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయ్. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో కూడా ఒక ప్రత్యేకమైన ఐటెం సాంగ్‌లో కనిపించబోతోందట. టాప్ ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ సంస్థ .. ఈ సినిమాకు ఆమెను తీసుకోవాలని డిమాండ్ చేసిందట. మొదట వద్దు అంటూ రిజెక్ట్ చేసిన ఈ హీరోయిన్ ఆ తరువాత  స్వయంగా కొంచెం ఆలోచన తర్వాత, ప్రొడ్యూసర్ నుండి వచ్చిన హై రికమండేషన్‌తో ఆమె ఆఫర్‌ని అంగీకరించింది.ఇప్పుడున్న పరిస్థితిలో, సోషల్ మీడియాలో ఈ నిర్ణయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది సినీ ప్రముఖులు, “హీరోయిన్గా కెరీర్ సక్సెస్ అవుతున్న సమయంలో ఇలాంటి ఐటెం సాంగ్ తీసుకోవడం ఆమెకు బిగ్ మిస్టేక్ అవుతుందా?” అనే చర్చను మొదలెట్టారు. ఈ విషయంలో మీనాక్షి చౌదరి తీసుకునే నిర్ణయం, ఆమె కెరీర్  పై ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది..!?


మరింత సమాచారం తెలుసుకోండి: