టాలీవుడ్ లో ఎప్పుడు ఏ గాసిప్ గుప్పమంటుందో ఎవరికీ తెలియదు. కొన్ని గాసిప్ లు కొన్నాళ్లకు నిజాలు అవుతూ ఉంటాయి .. కొన్ని పుకార్లుగా మిగిలిపోతూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్ లో కొత్త పుకారు గుప్పుమంటుంది. టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్టులలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న డ్రాగన్ సినిమా ఒకటి. ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమాకు ఇప్పటికే రెండు వారాల షూటింగ్లో కూడా ఎన్టీఆర్ పాల్గొన్నారు. అయితే చిన్న ఇబ్బంది రావడంతో సినిమాకు బ్రేక్ పడింది. ఇటీవల ఈ విషయమై నిర్మాత నవీన్ క్లారిటీ ఇస్తూ అనుకోకుండా రెండు నెలలు గ్యాప్ వచ్చిందని . . . త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు మరో కొత్త పుకారు వినిపించడం మొదలైంది.


డ్రాగన్ సినిమా కథ విషయంలో .. . అలాగు ఇప్పటివరకు వచ్చిన ఫుటేజ్ విషయంలో హీరో ఎన్టీఆర్ పునర్ ఆలోచనలో పడినట్టు టాలీవుడ్ లో పుకార్లు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన ఫుటేజ్ మీద ఎన్టీఆర్ పూర్తి సంతృప్తితో లేరని టాక్ వినిపిస్తోంది. అందువల్ల కథలో మార్పులు . . . చేర్పులు చేయటం లేదా లైన్ మార్చటం అనే చర్చలు జరుగుతున్నాయని , ఏం జరిగినా టైటిల్ మాత్రం డ్రాగన్ అన్నదే ఉంటుందన్న గుసగుసలు కూడా టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అన్నది పూర్తిగా క్లారిటీ అయితే లేదు.


కానీ టాలీవుడ్ లో ఈ పుకారు ఇప్పుడు గట్టిగా వైరల్ అవుతుంది. దీనిపై కొద్ది రోజులు ఆగితే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన మల్టీ స్టార‌ర్ వార్ 2 సినిమా ప్లాప్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ తో క‌లిసి ఎన్టీఆర్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ కు కూడా న‌చ్చ‌లేదు. డ్రాగన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవ‌ర సీక్వెల్ దేవ‌ర 2 సినిమాలో నటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: