నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్ట్ “ అఖండ 2 తాండవం ” పై టాలీవుడ్‌లో హైప్‌ రోజు రోజుకీ పెరుగుతోంది. బ్లాక్‌బస్టర్ హిట్ అఖండ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ కాంబినేషన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ప్రేక్షకులకు తెలిసిందే. అందుకే ఈ సెన్సేషనల్ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
అయితే ఇంత భారీ స్థాయి ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఉన్న ఆసక్తికి తగినట్లుగా మేకర్స్‌ నుంచి అప్డేట్స్‌ రాకపోవడం కొంత నిరాశ కలిగిస్తోంది. దీపావళి పండుగ వ‌చ్చేసినా కూడా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, లేదా ఫస్ట్ సింగిల్ పై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. “అఖండ 2 తాండవం” లాంటి పెద్ద సినిమాకి ప్రమోషనల్ క్యాంపైన్ ఇప్పటికే మొదలవ్వాలి అని వారు ఆశ‌ల‌తో ఉన్నారు.


అయితే అఖండ 2 - తాండ‌వం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. భారీ యాక్షన్ సీక్వెన్సులు, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ వంటి టెక్నికల్ వర్క్‌పై టీమ్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సారి బాలయ్య పాత్రను మరింత ఆధ్యాత్మికతతో పాటు మాస్ టచ్ కలిపి ఈ సినిమా ను తెర‌కెక్కించ‌డు. అయితే అభిమానులు మాత్రం కనీసం సోషల్ మీడియా ఇంటరాక్షన్ అయినా పెంచాలని కోరుకుంటున్నారు. ఒక చిన్న అప్డేట్‌ అయినా వస్తే సినిమా మీద మళ్లీ ఉత్సాహం పెరుగుతుందని కోరుకుంటున్నాడు. ఇలా చ‌డీ చెప్పుడు లేకుండా సైలెంట్‌గా ఉండ‌డం వారికి న‌చ్చ‌డం లేదు. ఈ విష‌యంలో బాల‌య్య అభిమానులు అంద‌రూ బోయ‌పాటిని త‌ప్పు ప‌డుతున్నారు. సౌండ్ పెంచాల‌ని కోరుతున్నారు. ఫైన‌ల్ గా  “ అఖండ 2 తాండవం ” నుంచి ఒక్క పోస్టర్‌ వచ్చినా సోషల్ మీడియా కుదిపేయడం ఖాయం. ఈ కాంబో మళ్లీ ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో అన్న ఆసక్తి మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: